Director Sandeep Raj | నేనే దురదృష్టవంతుడిని.. ‘కలర్ ఫొటో’ దర్శకుడు సందీప్ రాజ్ ఎమోషనల్ పోస్ట్!
Mowgli Movie | 'కలర్ ఫొటో' సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న దర్శకుడు సందీప్ రాజ్ తన తాజా చిత్రం మౌగ్లీ (Mowgli)తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.
Mowgli Movie | ‘కలర్ ఫొటో’ సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న దర్శకుడు సందీప్ రాజ్ తన తాజా చిత్రం మౌగ్లీ (Mowgli)తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. సినిమా విడుదల విషయంలో ఇబ్బందులు వస్తున్నాయని సందీప్ రాజ్ తన ఆవేదన వ్యక్తం చేశాడు.
సందీప్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెడుతూ.. ‘కలర్ ఫొటో’, ‘మౌగ్లీ’ వంటి సినిమాలు నాకు బదులుగా మరొక దర్శకుడికి తీయాల్సింది. ఈ రెండు చిత్రాలు.. సినిమా అంటే పడి చచ్చి, పని పట్ల ఎంతో నిబద్ధత, అభిరుచి ఉన్న వ్యక్తుల బృందంచే రూపొందించబడ్డాయి. ఈ రెండు సినిమాల్లో ఉన్న రెండు కామన్ విషయాలు ఏంటంటే.?
1. అన్నీ బాగా జరుగుతున్నాయని అనుకున్న సమయంలో వాటి విడుదల విషయంలో దురదృష్టాన్ని ఎదుర్కోవడం.
2. రెండోది నేను.
బహుశా ఆ బ్యాడ్ లక్ నేనేనేమో. నాకు కూడా అలాగే అనిపించడం మొదలైంది. థియేటర్లలో “దర్శకత్వం: సందీప్ రాజ్” అనే టైటిల్‌ను చూసే నా కల రోజురోజుకూ కష్టమవుతోంది. సిల్వర్‌స్క్రీన్ నన్ను ద్వేషిస్తుందేమో అనిపిస్తోంది. ‘మౌగ్లీ’ సినిమా రోషన్, సరోజ్ గారు, సాక్షి, హర్ష, డీవోపీ మారుతి, భైరవ వంటి ఎంతో మంది అంకితభావం ఉన్న వ్యక్తుల కష్టం, చెమట, రక్తంతో తయారైంది. కనీసం వారి కోసమైనా ‘మౌగ్లీ’కి అన్ని మంచి జరగాలని నేను నిజంగా ఆశిస్తున్నాను. అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు సందీప్ రాజ్.
Maybe Colour Photo and Mowgli deserved another DIRECTOR instead of me. These movies were made by a group of passionate people who can do anything for their profession.
The common points between both films are:
1. Facing bad luck with their release, just when everything seemed to…— Sandeep Raj (@SandeepRaaaj) December 9, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

