Actor Prabhas | ప్రముఖ టాలీవుడ్ నటుడు ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. బాహుబలి రీ రిలీజ్ సందర్భంగా జపాన్‌కి వెళ్లిన ప్రభాస్ అక్కడి అభిమానులతో పాటు మీడియాతో ముచ్చటిస్తున్నారు. అయితే ప్రభాస్ జపాన్‌లో ఉన్న సమయంలోనే అక్కడ భారీ భూకంపం సంభవించింది. దీంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతూ పోస్ట్‌లు పెడుతున్నారు. అయితే ప్రభాస్‌తో పాటు అతడి బృందం పూర్తిగా సురక్షితంగా ఉన్నారని దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని దర్శకుడు మారుతి తెలిపాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టాడు.
ప్రభాస్‌తో ఇప్పుడే మాట్లాడాను. భూకంపం వచ్చిన ప్రాంతంలో ఆయన లేరు. ఆయన క్షేమంగా, సురక్షితంగా ఉన్నారు. దయచేసి ఆందోళన చెందకండి అంటూ అభిమానులను ఉద్దేశించి మారుతి రాసుకోచ్చాడు. ప్రభాస్ సురక్షితంగా ఉన్నారనే వార్త తెలియగానే ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.