Siricilla : గ్రామ పంచాయతీ ఎన్నికల భారీగా మద్యం తరలిస్తున్న ఇద్దరిని జిల్లా టాస్క్ఫోర్స్, బోయిన్పల్లి పోలీసులు పట్టుకున్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టాలనుకున్న వీరి నుంచి రూ.1,33,000ల విలువైన విలువై మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. బోయినపల్లి ఎస్.ఐ రమాకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో స్థంభంపల్లి గ్రామానికి చెందిన సంతోష్, సుమన్ అనే ఇద్దరు వ్యక్తులు మంగళవారం వేములవాడ పట్టణ పరిధిలోని నాంది కమాన్ దగ్గరి వైన్స్ నుండి భారీగా మద్యం కొనుగోలు చేశారు.
సంతోష్, సుమన్ కారులో మందుబాటిళ్లను స్థంభంపల్లికి తరలిస్తున్నారనే సమాచారం మేరకు జిల్లా టాస్క్ఫోర్స్ బృందం, బోయినపల్లి పోలీసులు సోదాలు జరిపారు. వీరి కారును తనికీ చేయగా రూ.1,33,000ల విలువైన 253 లీటర్ల మద్యం లభించింది. కారు సీజన్ చేసిన పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా అక్రమ మద్యం, డబ్బు రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఐ రమాకాంత్ తెలిపారు.