Akhanda 2 : నందమూరి బాలకృష్ణ అభిమానులకు గుడ్‌న్యూస్. బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన అఖండ 2 (Akhanda 2) విడుదల తేదీపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. డిసెంబర్ 12న ఈ చిత్రం థియోటర్లో ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించనుంది. సినిమా విడుదల తేదీని మంగళవారం అధికారికంగా వెల్లడించింది అఖండ 2 టీమ్. తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ 11న రాత్రి 9 గంటల నుంచి ప్రీమియర్ షో వేయనున్నారు. ఎట్టకేలకు అఖండ 2 రిలీజ్ తేదీ ఫిక్స్ కావడంతో అభిమానులు మస్త్ ఖుషీ అవుతున్నారు.
ప్రీమియర్స్ తో 11 న రాత్రి 💥💥🔥
అఖండ తాండవం ఫీవర్ స్టార్ట్ 🔥🔥🔥 https://t.co/cI9hGW6tb4— Akhanda2Official (@Akhanda2Officia) December 9, 2025
అఖండ 2 తాండవం ఒక ఫాంటసీ యాక్షన్ డ్రామా సినిమా. 2021లో బ్లాక్‌బస్టర్ హిట్టైన అఖండ(Akhanda)కు సీక్వెల్‌గా ఎం. తేజస్వినీ నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ & IVY ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై రామ్ ఆచంట, గోపీ ఆచంట, ఇషాన్ సక్సేనా నిర్మించారు. బాలకృష్ణ, సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జూన్ 9న, ట్రైలర్‌ను నవంబర్ 21న విడుదల చేశారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందింది ఈ చిత్రం. డిసెంబర్ 12న తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడదుల కానుంది.
First date announcement @Akhanda2Officia ok na Fans #JaiBalayya 🔥🦁🔥🔥🔥 https://t.co/b8bSs44dlG
— Akhanda2Official (@Akhanda2Officia) December 9, 2025