IND vs SA : వన్డే సిరీస్ విజయోత్సాహాన్ని టీ20లోనూ కొనసాగిస్తూ ఘనంగా బోణీ కొట్టింది భారత్. బరాబతి స్టేడియంలో దక్షిణాఫ్రికాను 101 పరుగుల తేడాతో చిత్తుచిత్తుగా ఓడించింది. హార్దిక్ పాండ్యా(59 నాటౌట్, 1-16) ఆల్‌రౌండ్ షోకు.. అక్షర్ పటేల్(23, 2-7) మెరుపులు తోడవ్వగా సఫారీ టీమ్ 74కే ఆలౌటయ్యింది. పొట్టి క్రికెట్లో ప్రొటిస్‌కు ఇదే అత్యల్ప స్కోర్ కావడం విశేషం. టీ20ల్లో తమకు తిరుగులేదని నిరూపించిన సూర్యకుయార్ బృందం ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
టీ20 ప్రపంచకప్ ఛాంపియన్ భారత జట్టు జోరు కొనసాగుతోంది. ఇటీవలే ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్ గెలుపొందిన సూర్యకుమార్ సేన.. స్వదేశంలోనూ వేట మొదలెట్టింది. మంగళవారం బరాబతి స్టేడియంలో దక్షిణాఫ్రికాను బెంబేలెత్తించిన టీమిండియా 101 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన భారత్.. 12.3 ఓవర్లలోనే మ్యాచ్ ముగించి సిరీస్‌లో ముందంజ వేసింది.
An emphatic win in the #INDvSA T20I series opener 🥳#TeamIndia register a 1⃣0⃣1⃣-run victory in Cuttack to go 1⃣-0⃣ up 🙌
Scorecard ▶️ https://t.co/tiemfwcNPh@IDFCFIRSTBank pic.twitter.com/mw3oxC5AHw
— BCCI (@BCCI) December 9, 2025
కటక్ బరాబతి స్టేడియంలో భారీ స్కోర్ చేసిన భారత జట్టు.. ప్రత్యర్ధిని వణికించింది. తొలి ఓవర్లోనే వికెట్ తీసిన పేసర్ అర్ష్‌దీప్ సింగ్(2-14).. తన రెండో ఓవర్లోనూ వికెట్ అందించాడు. ఫామ్‌లో ఉన్న క్వింటన్ డికాక్(0)ను డకౌట్ చేశాడు అర్ష్‌దీప్. డికాక్ ఆడిన బంతి ఎడ్జ్ తీసుకోగా స్లిప్‌లో అభిషేక్ క్యాచ్ అందుకున్నాడు. అనంతరం రెండు ఫోర్లు బాదిన ట్రిస్టన్ స్టబ్స్(14)ను సైతం ఔట్ చేసి సఫారీలను దెబ్బతీశాడీ యంగ్‌స్టర్. దాంతో.. 16 పరుగులకే రెండు బిగ్ వికెట్లు కోల్పోయింది సఫారీ జట్టు. అంతుకుముందు బుమ్రా ఓవర్లో మర్క్రమ్(14)కు లైఫ్ లభించింది. అతడు సిక్సర్ కొట్టాలనుకున్న బంతిని బౌండరీ వద్ద శివం దూబే పైకెగిరి అందుకొని.. రోప్ తగిలేలోపు బయటకు విసిరేశాడు.
Spinners doing the trick 🪄
Axar Patel 🤝 Varun Chakaravarthy #TeamIndia chipping away at the wickets in Cuttack 🔢
Updates ▶️ https://t.co/tiemfwcNPh #INDvSA | @akshar2026 | @chakaravarthy29 | @IDFCFIRSTBank pic.twitter.com/Hjg7nUKCDV
— BCCI (@BCCI) December 9, 2025
స్టబ్స్ వికెట్ పడడంతో క్రీజులోకి వచ్చిన డెవాల్డ్ బ్రెవిస్ (22).. తనస్టయిల్‌లో చెలరేగాడు. వరుణ్ చక్రవర్తి ఓవర్లో 4,6 బాదిన బ్రెవిస్ స్కోర్ 40 దాటించాడు. అయితే.. ఆరో ఓవర్లో తొలి బంతికే మర్క్రమ్ లెగ్ స్టంప్‌ను ఎగరేశాడు అక్షర్ పటేల్. అంతే.. 40కే మూడు వికెట్లు పడ్డాయి. పవర్ ప్లేలో 3 వికెట్ల నష్టానికి సఫారీ టీమ్ 45 రన్స్ చేసింది. పాండ్యా మొదటి బంతికే డెవిడ్ మిల్లర్(1)ను.. డేంజరస్ డొనోవాన్ ఫెరీరా(5)ను వరుణ్ ఔట్ చేయగా 50కే ఐదు వికెట్లు కోల్పోయింది. తన ఓవరలో సిక్సర్ బాదిన మార్కో యాన్సెన్‌ను వరుణ్ బౌల్డ్ చేయగా మ్యాచ్ పూర్తిగా టీమిండియా చేతుల్లోకి వచ్చింది. బుమ్రా ఓవర్లో బ్రెవిస్ మిడాన్‌లో సూర్యకు దొరికిపోగా.. సఫారీల ఓటమి ఖాయమైంది. చివరి బ్యాటర్ మహరాజ్()ను దూబే ఔట్ చేయగా సఫారీ టీమ్ 74కే కుప్పకూలింది.
పునరాగమనం మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా(59 నాటౌట్) రెచ్చిపోయాడు. ఇటీవలే స్మాట్‌లో మెరుపులు మెరిపించిన పాండ్యా.. తొలి టీ20లో దక్షిణాఫ్రికాపైనే చెలరేగాడు. క్రీజులోకి వచ్చీరాగానే ఈ ఆల్‌రౌండర్ ఫోర్లు, సిక్సర్లు బాదేయగా టీమిండియా భారీస్కోర్ చేసింది. పవర్ ప్లేలో లుంగి ఎంగిడి(3-31) విజృంభణతో కష్టాల్లో పడిన జట్టును ఓపెనర్ అభిషేక్ శర్మ(17), తిలక్ వర్మ(26)లు ఆదుకున్నారు. వీరిద్దరి తర్వాత అక్షర్ పటేల్(23) జతగా పాండ్యా చితక్కొట్టాడు. చివరి ఓవర్లో 12 రన్స్ పిండుకోవడంతో ప్రత్యర్ధికి 176 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది టీమిండియా.