Hardik Pandya : భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) మరో రికార్డు నెలకొల్పాడు. తనకెంతో ఇష్టమైన టీ20ల్లో సిక్సర్ల సెంచరీ కొట్టేశాడీ ఆల్‌రౌండర్. కటక్‌లోని బారబతి స్టేడియంలో దక్షిణాఫ్రికా బౌలర్లను ఉతికేస్తూ నాలుగు సిక్సర్లు బాదిన పాండ్యా.. వంద సిక్సర్ల క్లబ్లో చేరాడు. అంతర్జాతీయంగా పొట్టి ఫార్మాట్లో ఈ మైలురాయిని అధిగమించిన నాలుగో భారత క్రికెటర్‌గా అవతరించాడీ బరోడా స్టార్. మూడు నెలల విరామం తర్వాత పునరాగమనం మ్యాచ్‌లోనే ఈ ఫీట్ సాధించడం విశేషం.
టీమిండియా మ్యాచ్ విన్నర్ అయిన హార్దిక్ పాండ్యా అంతర్జాతీయంగా టీ20ల్లో అదరగొడుతున్నాడు. మంగళవారం సఫారీలపై 59 పరుగులతో అజేయంగా నిలిచిన పాండ్యా.. వంద సిక్సర్ల క్లబ్లో అడుగుపెట్టాడు. అయితే.. అత్యధిక సిక్సర్లు బాదిన భారత క్రికెటర్‌గా రికార్డు రోహిత్ శర్మ (Rohit Sharma) పేరిట ఉంది. మంచినీళ్లు తాగినంత సులభంగా బంతిని స్టాండ్స్‌లోకి పంపే హిట్‌మ్యాన్ 205 సిక్సర్లతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ప్రస్తుతం టీమిండియా సారథిగా వ్యవహరిస్తున్న సూర్యకుమార్ యాదవ్ 155తో రోహిత్‌కు దరిదాపుల్లో ఉన్నాడు.
𝐂𝐞𝐧𝐭𝐮𝐫𝐲 𝐨𝐟 𝐌𝐚𝐱𝐢𝐦𝐮𝐦𝐬 💯
1⃣0⃣0⃣ T20I sixes for Hardik Pandya 🔥
Updates ▶️ https://t.co/tiemfwcNPh #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/mZjJXhr5S9
— BCCI (@BCCI) December 9, 2025
సిక్సర్ల సెంచరీ జాబితాలో విరాట్ కోహ్లీ 124 సిక్సర్లతో మూడో స్థానంలో కొనసాగుతుండగా.. పాండ్యా నాలుగో ప్లేస్ సాధించాడు. కేఎల్ రాహుల్ 99 సిక్సర్లతో ఐదో స్థానంలో నిలిచాడు. నిరుడు టీ20 ప్రపంచకప్ తర్వాత ఈ ఫార్మాట్‌కు రోహిత్, విరాట్ వీడ్కోలు పలికారు. దాంతో.. పాండ్యా మరో 25 సార్లు బంతిని స్టాండ్స్‌లోకి పంపితే కోహ్లీ రికార్డును బ్రేక్ చేసే అవకాశముంది.
Hardik Pandya need no reservations like Shubman Gill 🤐
Pandya is back in the team, he performs, he wins trophies, and he enjoys his life, and then he repeats the same 👏🏻
Pandya is the only guy, who is quite consistent like Virat & Rohit 🔥pic.twitter.com/wGRlZuLm5F
— Richard Kettleborough (@RichKettle07) December 9, 2025