Ustaad Bhagat Singh | పవన్ కల్యాణ్ (Pawan Kalyan) టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ (UstaadBhagatSingh). హరీష్ శంకర్ (Harish shankar) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. రాశీఖన్నా కీ రోల్ పోషిస్తోంది. లీడింగ్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో హింట్ ఇచ్చేసింది.
ముందుగా ప్రకటించిన ప్రకారం మేకర్స్ ఈ మూవీ ఫస్ట్ సింగిల్ దేఖ్ లేంగే సాలా ప్రోమోను లాంచ్ చేశారు. దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ పాటను భాస్కర బట్ల రాయగా.. విశాల్ దడ్లానీ పాడాడు. పవన్ కల్యాణ్‌లోని స్టైలిష్ అవతార్‌ను మరోసారి సిల్వర్ స్క్రీన్‌పై చూపించబోతున్నట్టు ప్రోమో చెప్పేస్తుంది. రంపంపం రంపంపం స్టెప్పేస్తే భూకంపం అంటూ పవన్ కల్యాణ్ వేసే స్టైలిష్ స్టెప్పులు స్టేజ్ షేక్ అవడం గ్యారంటీ అని ప్రోమో చెబుతోంది. ఇక తమ అభిమాన హీరో మ్యానరిజాన్ని చూసిన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతూనే.. పూర్తి సాంగ్ కోసం ఎదురుచూస్తున్నారు.
భగత్.. భగత్ సింగ్ మహంకాళి పోలీస్‌స్టేషన్, పత్తర్ గంజ్, ఓల్డ్ సిటీ. ఈ సారి పర్ ఫార్మన్స్ బద్దలైపోద్ది.. అంటూ ఉస్తాద్ భగత్ సింగ్‌లో తనదైన మ్యానరిజంతో సాగుతున్న పవన్ కల్యాణ్ డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రాన్ని మార్చి 26న 2026కు విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
దేఖ్ లేంగే సాలా స్టైలిష్ ప్రోమో !..
Director Sandeep Raj | నేనే దురదృష్టవంతుడిని.. ‘కలర్ ఫొటో’ దర్శకుడు సందీప్ రాజ్ ఎమోషనల్ పోస్ట్!
Actor Prabhas | జపాన్‌లో భూకంపం.. ప్రభాస్‌కి తప్పిన ప్రమాదం
V. Shantaram Biopic | వి. శాంతారామ్ బయోపిక్‌లో హీరోయిన్గా తమన్నా.. ఫస్ట్ లుక్ రిలీజ్