దక్షిణాది చలన చిత్రపరిశ్రమలో ఉన్న బిజీగా ఉన్న యాక్టర్లలో ఒకరు ప్రకాశ్‌రాజ్ (Prakash Raj). విలక్షణ నటనకు కేరాఫ్ అడ్రస్‌గా పిలుచుకునే ప్రకాశ్‌రాజ్..ముక్కుసూటిగా ప్రశ్నించే తత్వం కలిగిన వ్యక్తి. తన వాక్చాతుర్యంతో ఎదుటివారికి ముచ్చెమటలు పట్టించగల నైజం ప్రకాశ్‌రాజ్ సొంతం. మాటల తూటాలు పేల్చే ప్రకాశ్‌రాజ్ కొంతకాలం మౌనం వహించబోతున్నారు. మళ్లీ ఆయన స్వరం వినేందుకు (Prakash Raj silence) కొంత సమయం పట్టనుంది. ఇదే విషయాన్ని ట్వీట్ ద్వారా తెలియజేశాడు ప్రకాశ్‌రాజ్.
‘డాక్టర్ల పర్యవేక్షణలో పూర్తిగా చెకప్ చేయించుకున్నా. నేను చురుకుగా ఉన్నా. కేవలం నా స్వర తంత్రుల (vocal cords) (గొంతు)కు ఓ వారం పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. కాబట్టి మౌన వ్రతం. ఆనందంగా నిశ్శబ్దంలో మునిగిపోతారు..’ అంటూ ట్వీట్ పెట్టాడు ప్రకాశ్‌రాజ్. ఈ ట్వీట్ ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Had a complete check up with the doctors.. I’m rocking .. only my vocal chords need complete rest for a week. So “Mouna vratha “ .. will bask in silence..Bliss
— Prakash Raj (@prakashraaj) November 15, 2021
ఇటీవలే సూర్య ప్రధాన పాత్రలో వచ్చిన జైభీమ్‌లో పోలీసాఫీసర్ పాత్రలో మెరిశాడు ప్రకాశ్‌రాజ్. అయితే జైభీమ్ సన్నివేశానికనుగుణంగా పోలీసాఫీసర్ పాత్రలో ఉన్న ప్రకాశ్ రాజ్ ఓ వ్యక్తిని కొట్టే సీన్‌పై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. గిరిజన ప్రజలకు జరిగిన అన్యాయాన్ని ప్రేక్షకులు ఎలా అనుభవించలేకపోతున్నారని, చెంపదెబ్బను చూడలేకపోతున్నారని ఆశ్చర్యపోయాడు ప్రకాశ్‌రాజ్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Upasana: పిల్లల గురించి ఉపాసనకు ప్రశ్న.. సమాధానం ఏంటంటే..!
Upasana Surprise| ఉక్రెయిన్ లో ఉపాసన సర్ప్రైజ్..పోస్ట్ వైరల్
Nayantara or Samantha | సమంత, నయనతారలో ఇంతకీ ఎవరు ఆ ఛాన్స్ కొట్టేసేది..?
Sai Pallavi New Skill | కొత్త టాలెంట్ చూపిస్తానంటున్న సాయిపల్లవి