Prabhas | పాపులర్ రైటర్ పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు సుదర్శన్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం ‘మిస్టర్ సెలెబ్రిటీ’ (Mr Celebrity). రవికిశోర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) మిస్టర్ సెలబ్రిటీ యూనిట్‌కు అందించిన స్పెషల్ విషెస్ టీంలో జోష్ నింపుతోంది.
టీంకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రభాస్ ఓ సందేశాన్ని షేర్ చేశాడు. నాకు మొదటి బ్లాక్ బస్టర్ పరుచూరి వెంకటేశ్వర్ రావు అందించారు. పరుచూరి మనవడు సుదర్శన్ హీరోగా డెబ్యూ ఇస్తున్న సందర్భంగా ఆల్ ది బెస్ట్. మిస్టర్ సెలబ్రిటీతో హీరోగా ఎంట్రీ ఇస్తున్న సుదర్శన్ గొప్ప విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షిస్తున్నా. తన కెరీర్లో విక్టరీలు విజయాలను అందుకుంటూ.. ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ప్రభాస్ విష్ చేశాడు. సోషల్ మీడియాలో ప్రభాస్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఈ చిత్రంలో వరలక్ష్మీశరత్‌కుమార్, శ్రీదీక్ష, నాజర్, రఘుబాబు కీలక పాత్రల్లో నటించారు. ఆర్పీ సినిమాస్ బ్యానర్‌పై ఎన్.పాండురంగారావు, చిన్న రెడ్డయ్య నిర్మించిన ఈ చిత్రానికి వినోద్ యజమాన్య సంగీతం అందించాడు.
Straight from the #RebelStar 🫶🏻
Darling of Indian cinema, #Prabhas Garu, extended his best wishes to the #MrCelebrity team ahead of their movie release 🙌🏻💗#MrCelebrityFromTomorrow https://t.co/10pQjXi53n#ParuchuriSudarshan #SriDeeksha @varusarath5 #Nasar #Raghubabu… pic.twitter.com/s82GfVenaL
— SR Promotions (@SR_Promotions) October 3, 2024
Read Also :
Vijay Sethupathi | పాపులర్ లీడర్ బయోపిక్‌లో విజయ్ సేతుపతి.. వివరాలివే
Mathu Vadalara 2 | దసరా స్పెషల్.. మత్తు వదలరా 2 టికెట్ కేవలం రూ.112 మాత్రమే
Kick 2 | గెట్ రెడీ డబుల్ కిక్ ఇస్తానంటున్న సల్మాన్ ఖాన్.. కిక్ 2 వచ్చేస్తుంది
Swag Twitter Review | వన్ మ్యాన్ షోలా శ్రీవిష్ణు స్వాగ్.. ఇంతకీ నెట్టింట టాక్ ఎలా ఉందంటే..?
Indian 3 | ఆ వార్తలే నిజమయ్యాయి.. డైరెక్టుగా ఓటీటీలోనే కమల్‌హాసన్ ఇండియన్ 3