Mathu Vadalara 2| రితేశ్ రానా దర్శకత్వంలో క్రైం కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన సీక్వెల్ ప్రాజెక్ట్ మత్తు వదలరా 2 (Mathu Vadalara 2). శ్రీ సింహా (Sri Simha), సత్య కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీలో జాతి రత్నాలు ఫేం ఫరియా అబ్దుల్లా ఫీ మేల్ లీడ్ రోల్ పోషించింది. సెప్టెంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది.
మెగాస్టార్ చిరంజీవితోపాటు పలువురు సెలబ్రిటీలు సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. నాలుగో వారంలో కూడా పలు సెంటర్లలో సక్సెస్‌ఫుల్‌గా స్క్రీనింగ్ అవుతోంది. కాగా దసరా పండుగను క్యాష్ చేసుకునేందుకు మత్త వదలరా 2 మేకర్స్ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. మత్తవదలరా 2 చిత్రాన్ని ఇక రూ.112 టికెట్‌కే వీక్షించవచ్చంటూ మూవీ లవర్స్ కోసం షేర్ చేశారు.
ఈ దసరా సెలవులకు కుటుంబంతో కలిసి ఉల్లాసభరితమైన వినోదాన్ని ఆస్వాదించండి.. అంటూ విడుదల చేసిన మత్త వదలరా 2 కొత్త పోస్టర్ నెట్టింట రౌండప్ చేస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ చిత్రానికి కాల భైరవ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు.
మూవీ టీజర్, ట్రైలర్లో హి..హి..హి.. టీమా అంటే అన్నీ హిలు లేవు.. ఒకటే హి అంటూ ఫన్నీగా సాగుతున్న డైలాగ్స్‌తోపాటు ఇలా దొంగతనాలు చేయడానికి సిగ్గు లేదా.. అంటుంటే.. అయినా ఇది దొంగతనం కాదు.. తస్కరించుట అంటూ సత్య టైమింగ్‌తో సాగే సంభాషణలు సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేయడంలో కీ రోల్ పోషించాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
Enjoy the HELARIOUS BLOCKBUSTER THRILLER #MathuVadalara2 at Rs.112 only ❤🔥#BlockbusterMathuvadalara2 pic.twitter.com/hVUe56gbrf
— BA Raju’s Team (@baraju_SuperHit) October 4, 2024
Kick 2 | గెట్ రెడీ డబుల్ కిక్ ఇస్తానంటున్న సల్మాన్ ఖాన్.. కిక్ 2 వచ్చేస్తుంది
Swag Twitter Review | వన్ మ్యాన్ షోలా శ్రీవిష్ణు స్వాగ్.. ఇంతకీ నెట్టింట టాక్ ఎలా ఉందంటే..?
Indian 3 | ఆ వార్తలే నిజమయ్యాయి.. డైరెక్టుగా ఓటీటీలోనే కమల్‌హాసన్ ఇండియన్ 3