కొత్త లంబోర్గిని కారులో ప్రభాస్ సోదరి షికారు.. వీడియో వైరల్
ప్రభాస్ కారు | ప్రభాస్ దగ్గర ఇప్పటికే BMW 520D, ఇన్నోవా క్రిస్టా, జాగ్వార్ ఎక్స్‌జేఎల్, రేంజ్ రోవర్ వోగ్, రోల్స్ రాయ్స్ గోస్ట్ కార్లు ఉన్నాయని సమాచారం. ఇప్పుడు ఈ జాబితాలోకి లంబోర్గిని అవెంటాడర్ ఎస్ రోడ్‌స్టర్ కూడా జాయిన్ అయింది.

మన హీరోల్లో చాలామందికి కార్ల పిచ్చి చాలానే ఉంది. మార్కెట్లోకి కొత్త కారు వచ్చిందంటే మన ఇంట్లో ఉండాల్సిందే అంటారు హీరోలు. ముఖ్యంగా ప్రభాస్ అయితే కార్లు బాగానే కొంటుంటాడు. రెండు వారాల కింద ఈయన కొత్త కారు కొన్నాడు. అదే లంబోర్గిని అవెటాండర్ ఎస్ రోడ్‌స్టర్. అది కూడా రూ.7కోట్లు ఖర్చు పెట్టి మరీ లగ్జరీ కారును బెంగళూరు నుంచి తన ఇంటికి తెప్పించుకున్నాడు. తెలుగు ఇండస్ట్రీలో మన హీరోల దగ్గర ఉన్న కార్లలో అత్యంత ఖరీదైన కారు ఇదే. నారింజ రంగులో మెరిసే పోయే ఈ కారు గురించి ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.
ప్రభాస్ ప్రస్తుతం నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నాడు. రాధాకృష్ణ కుమార్ తో రాధే శ్యామ్.. ప్రశాంత్ నీల్ తో సలార్.. ఓం రౌత్ తో ఆదిపురుష్.. నాగ్ అశ్విన్ తో మరో సినిమా చేస్తున్నాడు ఈయన. రాబోయే రెండేళ్ళలోనే ఈ చిత్రాలన్నీ విడుదల కానున్నాయి. ఈ సినిమాలు అన్నీ పాన్ ఇండియన్ సినిమాలే. పాన్ ఇండియన్ స్టార్‌గా మారిన ప్రభాస్ ఇప్పుడు రూ.100 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. దానికి తగ్గట్టుగానే మెయింటెనెన్స్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ముంబైలోనే సెటిల్ అవ్వాలని భావిస్తున్న ప్రభాస్.. అక్కడే రూ.50కోట్లతో భారీ విల్లా కొనుగోలుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే.. ఇటీవలే ప్రభాస్ అత్యంత ఖరీదైన కారు లంబోర్గిని అవెంటాడర్ ఎస్ రోడ్‌స్టర్ ను కొనుగోలు చేశాడు. మార్చి 28న ఈ కారు ప్రభాస్ ఇంటికి వచ్చింది. ప్రభాస్ దగ్గర ఇప్పటికే BMW 520D, ఇన్నోవా క్రిస్టా, జాగ్వార్ ఎక్స్‌జేఎల్, రేంజ్ రోవర్ వోగ్, రోల్స్ రాయ్స్ గోస్ట్ కార్లు ఉన్నాయని సమాచారం. ఇప్పుడు ఈ జాబితాలోకి లంబోర్గిని కూడా జాయిన్ అయింది. నారింజ రంగులో మెరిసే ఈ కారులో ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవితో పాటు ఆయన సొదరి ప్రసీద రైడ్‌కు వెళ్లారు. ఈ వీడియోను ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి పోస్ట్ చేశారు. హైదరాబాద్ రోడ్లపై ఈ ఇద్దరూ షికారు చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
సాయంత్రం ఎన్టీఆర్ 30వ సినిమాపై అఫీషియల్ అనౌన్స్మెంట్
జోరు మీదున్న సోహైల్.. యూట్యూబ్ ఛానెల్ మొదలెట్టేశాడు..!
కరోనా పాజిటివ్.. థియేటర్లో ప్రత్యక్షం అయిన హీరోయిన్
గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ సమీరా షరీఫ్
ఇంట్రెస్టింగ్గా ఉన్న ఖిలాడి టీజర్
కేటీఆర్ సర్.. మీరు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లో ప్రయత్నించలేదా?
16 ఏళ్ల తర్వాత బాక్సాఫీస్ వద్ద పోటీపడనున్న లెజండరీ స్టార్స్
హీరోయిన్‌పై నెమలి దాడి.. వీడియో వైరల్
పవర్ స్టార్‌కు పెద్ద షాక్ ఇచ్చిన యువరత్న
దక్షిణాది అవకాశాలువస్తున్నాయి!
అరణ్య క్లోజింగ్ కలెక్షన్స్ ఎంతంటే..
ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సైడ్ బిజినెస్ అదిరింది
చిరంజీవి లూసీఫర్ రీమేక్ కు అదిరిపోయే టైటిల్
టాలీవుడ్‌కు కష్టమే : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ థియేటర్ల బంద్ ?
వకీల్ సాబ్ సినిమాలో పవన్ తెలంగాణ యాసకు కారణం ఇదే..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

