Pottel | టాలీవుడ్ బ్యూటీ అనన్య నాగళ్ల (Anannya nagalla) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోన్న తాజా చిత్రం పొట్టేల్ (Pottel). ‘సవారీ’ ఫేం సాహిత్ మోత్ఖురి దర్శకత్వం వహిస్తున్నాడు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథాంశంతో వస్తోన్న ఈ చిత్రంలో యువ చంద్ర కృష్ణ హీరోగా నటిస్తున్నాడు. అక్టోబర్ 25న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది టీం.
తాజాగా పొట్టేల్కు సంబంధించిన ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. ఈ మూవీ నైజాం పంపిణీ హక్కులను పాపులర్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూలర్స్ ఎల్ఎల్పీ దక్కించుకుంది. ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో సాగే ఈ చిత్రాన్ని మైత్రీ టీం విడుదల చేస్తుండటంతో అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. పొట్టేల్ నుంచి ఇప్పటికే లాంచ్ చేసిన బుజ్జి మేక (Bujji meka song) సాంగ్‌కు మంచి స్పందన వస్తోంది.
ఇక గుర్రంగట్టు ప్రాథమిక పాఠశాల ముందు అనన్య నాగళ్ల తన కుటుంబంతో దిగిన పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. పొట్టేల్తో మనుషులకు ఉన్న అనుబంధం.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబింబే బోనాల పండుగను హైలెట్ చేస్తున్న దృశ్యాలు.. వేడుకల్లో అమ్మవారి ముందు పొట్టేల్‌ను బలి ఇవ్వడం, జోగిని రంగం లాంటి అంశాల సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి.
ఈ మూవీని ఎన్ఐఎస్ఏ ఎంటర్టైనర్మెంట్ బ్యానర్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రగ్యా సన్నిది క్రియేషన్స్ బ్యానర్‌పై సురేష్ కుమార్ సడిగే సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో అజయ్, ప్రియాంక శర్మ, తనస్వి చౌదరీ, నీల్ సీన్, చత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్, జీవన్, రియాజ్, విక్రమ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Prestigious Distribution house @MythriRelease is releasing the earthy and emotional tale #Pottel in Nizam❤️🔥#PottelOnOct25th pic.twitter.com/bfGpn45hs2
— BA Raju’s Team (@baraju_SuperHit) October 10, 2024
Siva Koratala | వర ఆడే ఆట చాలా కొత్తగా ఉంటది.. దేవర పార్టు 2పై కొరటాల శివ కామెంట్స్ వైరల్
Ratan Tata | మన దేశం కోసం పుట్టినందుకు ధన్యవాదాలు సార్.. రతన్ టాటాకు టాలీవుడ్ ప్రముఖుల నివాళి
Vettaiyan Twitter Review | జై భీమ్ డైరెక్టర్ మార్క్ చూపించాడా..? తలైవా వెట్టైయాన్ ఎలా ఉందంటే..?
Prabhas | క్రేజీ న్యూస్.. ప్రభాస్ వెడ్డింగ్ అనౌన్స్మెంట్ ఆన్ ది వే..!