Revolver Rita | ఓ వైపు గ్లామరస్ పాత్రలు చేస్తూనే.. మరోవైపు నటనకు ఆస్కారమున్న పాత్రల్లో నటిస్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది నేషనల్ అవార్డ్ విన్నింగ్ బ్యూటీ కీర్తి సురేశ్ (Keerthy Suresh). ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండగా.. ఈ భామ టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం రివాల్వర్ రీటా (Revolver Rita). చంద్రు (Kaddipudi Chandru) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో డిసెంబర్ 25న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు.
కాగా ఈ చిత్రం తెలుగు పంపిణీ హక్కులను హాస్య మూవీస్ నిర్మాత రాజేశ్ దండా దక్కించుకున్నట్టు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని ఫిలిం నగర్ సర్కిల్ టాక్. ఈ చిత్రంలో రాధిక, అజయ్ ఘోష్, సునీల్, జాన్ విజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
రీసెంట్గా విడుదల చేసిన రివాల్వర్ రీటా టీజర్లో.. కీర్తి సురేశ్ మార్క్ హ్యూమర్ టచ్‌తో యాక్షన్ పార్టుతో స్టన్నింగ్‌గా సాగుతోంది. కీర్తి సురేశ్ మార్కెట్లో కూరగాయలు కొంటుండగా.. పాత అంబాసిడర్ కారులో ఉన్న దొంగలునుంచి ఆమెను చూస్తారు. కారులో కీర్తిసురేశ్ దగ్గరకు వచ్చి హ్యాండ్ బ్యాగ్‌ను లాక్కెళ్తారు.
ఇంతకీ మీరు రా ఏజెంటా అని కీర్తిసురేశ్‌ను దొంగలు అడిగితే.. కాదు అని చెప్తుంది. ఇంతలోనే రాధికా శరత్‌కుమార్ (తల్లి) కీర్తిసురేశ్‌కు ఫోన్ చేసి కూరగాయలతో త్వరగా రమ్మని చెప్తుంది. ఇంతకీ కీర్తిసురేశ్ రివాల్వర్ రీటాగా మారడానికి కారణమేమై ఉంటుంది.. రివాల్వర్ రీటా ఏదైనా మిషన్‌లో పాల్గొంటుందా.. ? అనేది సస్పెన్స్ లో పెడుతూ సాగే సన్నివేశాలు సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి.
Devara | దేవర వచ్చేస్తున్నాడు.. ఓటీటీ ప్లాట్‌ఫాంలో తారక్ మూవీ స్ట్రీమింగ్ టైం ఫిక్స్
Nikhil Siddhartha | ప్రతీ పది నిమిషాలకో ట్విస్ట్.. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాపై నిఖిల్
Thandel | డైలామాకు చెక్.. ఆ టైంలోనే నాగచైతన్య తండేల్ రిలీజ్..!