టాలీవుడ్ యాక్టర్ బాలకృష్ణ, ప్రగ్యాజైశ్వాల్ కాంబోలో వస్తున్న చిత్రం అఖండ (akhanda). ఈ చిత్రంలో అందాల బ్యూటీ పూర్ణ (Poorna)కీలక పాత్రలో నటిస్తోంది. డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నవంబర్ 27న శిల్పకళావేదికలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పూర్ణ మాట్లాడిన మాటలు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి. చీఫ్ గెస్ట్‌గా వచ్చిన అల్లు అర్జున్ (Allu Arjun)ను, హీరో బాలకృష్ణను ప్రశంసలతో ముంచెత్తింది పూర్ణ.
భారీ బడ్జెట్ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన బోయపాటి శ్రీను (Boyapati )కు ధన్యవాదాలు..అంటూ జై బాలయ్య అని నినదించింది. నేను కేరళ నుంచి వచ్చా. చాలా మంది ఆర్టిస్టులతో పనిచేశా. కానీ ఎంత ఎదిగినా ఒదిగి ఉండే బాలకృష్ణ లాంటి ఎనర్జిటిక్ లాంటి నటుడితో ఇప్పటివరకు పనిచేయలేదు. మీరు నిజంగా రోల్ మోడల్. మీరు నా గాడ్ ఫాదర్ సార్ అంటూ ఆకాశానికెత్తేసింది పూర్ణ.
Actress Poorna about M'@alluarjun 😍🔥 At #AkhandaPrereleaseEvent pic.twitter.com/JZZEWm7MMQ #Poorna pic.twitter.com/qcQ9QlvDx2
— Pravi (@stylishpravi143) November 28, 2021
ఇక ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా వచ్చిన అల్లు అర్జున్‌కు కృతజ్ఞతలు తెలిపింది. నా స్నేహితుడు, చాకొలేట్ బాయ్ బన్నీకి ధన్యవాదాలు. కేరళలో తెలుగు సినీ పరిశ్రమకు పాపులారిటీ రావడానికి కారణం అల్లు అర్జునే అంటూ చెప్పుకొచ్చింది పూర్ణ. అఖండ ప్రీ రిలీజ్ వేడుకలో పూర్ణ మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.
ఇది కూడా చూడండి
Siddhas Saga Teaser | ధర్మస్థలికి ఆపదొస్తే..‘సిద్ధ’గా రాంచరణ్ క్లాస్, మాస్ ఎంట్రీ అదిరింది..వీడియోMurali Sharma doctorate | మహేశ్‌బాబు విలన్‌కు గౌరవ డాక్టరేట్
Mahesh Babu black Royal look | న్యూ స్టైలిష్ లుక్‌లో మహేశ్‌బాబు..ఫొటోషూట్ అదిరింది
Sagar K Chandra | రెండు రోజుల్లోనే పవన్ కల్యాణ్ స్వభావం తెలిసిపోయింది..భీమ్లా నాయక్ డైరెక్టర్
Kangana Ranaut on FIR | నన్ను అరెస్ట్ చేసేందుకు వస్తే..కంగనా సెటైరికల్ పోస్ట్