ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Sep 09, 2020 , 17:35:10

పీసీ శ్రీరామ్ వ‌ర్సెస్ కంగ‌నా ర‌నౌత్

పీసీ శ్రీరామ్ వ‌ర్సెస్ కంగ‌నా ర‌నౌత్

ఇండియాలో ఉన్న ది బెస్ట్ సినిమాటోగ్రాఫ‌ర్స్ లో ఒక‌రైన పీసీ శ్రీరామ్ బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ తో సినిమా ను తిర‌స్క‌రించిన సంగ‌తి తెలిసిందే. కంగ‌నాతో సినిమా చేసేందుకు ముంబై నుంచి నిర్మాత‌లు న‌న్ను సంప్ర‌దించారు. కంగ‌నా లీడ్ రోల్ సినిమాను తిర‌స్క‌రించా. నాకు అసౌక‌ర్యంగా అనిపించింది. నా అభిప్రాయ‌మేంటో నిర్మాత‌ల‌కు అర్థ‌మ‌య్యేట‌ట్టు చెప్పాను. కొన్ని సార్లు ఏది స‌రైన నిర్ణ‌య‌మో అదే తీసుకుంటాం. ఆ నిర్మాత‌లు చేయ‌బోయే సినిమాకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నాన‌ని పీసీ శ్రీరామ్ ట్వీట్ చేశారు. 

అయితే దీనిపై కంగ‌నా స్పందిస్తూ..మీ లాంటి లెజెండ్ తో ప‌ని చేసే అవ‌కాశాన్ని మిస్స‌య్యాను సార్‌. ఇది నాకు తీర‌ని లోటు. నా అంశంలో ఏ విష‌యం మిమ్మ‌ల్ని అసౌక‌ర్యంగా ఫీల‌య్యేలా చేసిందో నాకు తెలియ‌దు. కానీ మంచి నిర్ణ‌యం తీసుకున్నందుకు నేను సంతోషిస్తున్నా. మీకు ఆల్ ది బెస్ట్ స‌ర్ అంటూ రీట్వీట్ చేసింది. కంగ‌నా స్పందించిన వెంట‌నే పీసీ శ్రీరామ్ “చాలా ప్ర‌శంసించ‌ద‌గిన‌ది”  అంటూ మ‌రో ట్వీట్ చేశారు. 

కంగ‌నా, పీసీ శ్రీరామ్ కాంబినేష‌న్ లో గ‌తంలో ఎలాంటి సినిమా రాలేదు. ప్ర‌స్తుతం కంగ‌నా ర‌నౌత్ ముంబైపై వ్యాఖ్య‌లు, డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న విష‌యం తెలిసిందే. ఈ ప‌రిస్థితుల నేప‌థ్యంలో పీసీ శ్రీరామ్ కంగ‌నాతో సినిమాకు నో చెప్పిన‌ట్టు బీటౌన్ టాక్‌. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo