They Call Him OG | టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటిస్తోన్న చిత్రాల్లో మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ ఓజీ (OG). చాలా రోజులు గ్యాప్ తర్వాత సుజిత్ అండ్ టీం ఓజీ షూట్‌ను రీస్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. షూట్ లొకేషన్లో సినిమాటోగ్రఫర్ రవి కే చంద్రన్, సుజిత్, మ్యూజిక్ ఎస్ థమన్ వర్కింగ్ మూడ్‌లో ఉన్న స్టిల్స్ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతున్నాయి.
పవన్ కల్యాణ్ త్వరలోనే ఓజీ సెట్స్‌లో జాయిన్ కాబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర గాసిప్ నెట్టింట రౌండప్ చేస్తోంది. పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా ఓజీలో కామియో రోల్లో కనిపించబోతున్నాడంటూ వార్తలు షికారు చేస్తున్నాయి. తాజాగా దీనిపై క్లారిటీ వచ్చింది. ఓజీలో అకీరా నటిస్తున్నాడన్న వార్తల్లో వాస్తవం లేదని, అవన్నీ వట్టి పుకార్లేనని మేకర్స్ క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం. తాజా టాక్ ప్రకారం అకీరా ప్రస్తుతం ఫిల్మ్ మేకింగ్ నేర్చుకునే పనిలో బిజీగా ఉన్నాడట.
ఆరడుగులకుపైగా ఎత్తున్న అకీరా అద్భుతమైన స్క్రీన్ ప్రజెంటేషన్‌తో తండ్రి పవన్ కల్యాణ్ సినిమాలో కనిపిస్తాడని అనుకున్న అభిమానులకు ఇది బ్యా్డ్ న్యూస్ అనే చెప్పాలి. ఇప్పటికే లాంచ్ చేసిన HUNGRYCHEETAH గ్లింప్స్ నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. ఈ చిత్రంలో గ్యాంగ్ లీడర్ ఫేం ప్రియాంకా ఆరుళ్ మోహన్ (Priyanka Arul Mohan) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా… శ్రియారెడ్డి కీ రోల్ పోషిస్తుంది. ఈ చిత్రానికి ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
Kanguva | నా హీరోలకు లోపాలు చెబుతా కానీ.. సూర్య కంగువ నిర్మాత కేఈ జ్ఞానవేళ్ రాజా కామెంట్స్ వైరల్
Suraj Venjaramoodu | సింగిల్ షాట్లో 18 నిమిషాల సీన్.. విక్రమ్ వీరధీరసూరన్పై సూరజ్ వెంజరమూడు
Lucky Baskhar | దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ ట్రైలర్ అప్డేట్ లుక్ వైరల్
Pawan Kalyan Titles | పవన్ కల్యాణ్ టైటిల్స్ రిపీట్పై వర్రీ అవుతున్న ఫ్యాన్స్.. ఎందుకో మరి..?
Kiran Abbavaram | రహస్య గోరక్‌తో రిలేషన్షిప్ కొంతమందికే తెలుసు.. కిరణ్ అబ్బవరం కామెంట్స్ వైరల్