Pushpa 2 The Rule | టాలీవుడ్ స్టార్ యాక్టర్ అల్లు అర్జున్ (Allu Arjun) టైటిల్ రోల్లో నటిస్తోన్న ప్రాంఛైజీ ప్రాజెక్ట్ పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule). సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టారని తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జనవరి 4న రాజమండ్రిలో నిర్వహించేందుకు రెడీ అవుతున్నారట.
అంతేకాదు ఈవెంట్‌కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముఖ్యఅతిథిగా రాబోతున్నాడట. దీనికి సంబంధించి మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావడమే ఆలస్యమని ఇన్సైడ్ టాక్. కొంతకాలంగా పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ అభిమానుల మధ్య నెట్టింట గొడవ రాజుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ చీఫ్ గెస్టుగా వచ్చేది నిజమైతే మెగా అభిమానులతోపాటు మూవీ లవర్స్‌కు పండగే అని చెప్పాలి.
పుష్ప షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు ఇప్పటికే ప్రకటించింది అల్లు అర్జున్ టీం. సీక్వెల్ కోసం రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన పాటలు ఇప్పటికే బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతున్నాయి. కన్నడ భామ రష్మిక మందన్నా మరోసారి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
ఈ చిత్రంలో ఫహద్ ఫాసిల్, జగదీష్ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, ధనంజయ, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
Ram Gopal Varma | రాంగోపాల్ వర్మ ట్వీట్.. కోయంబత్తూరుకు ఏపీ పోలీసులు..!
Suriya 45 | సూర్య 45 పూజా సెర్మనీ టైం.. షూటింగ్ మొదలయ్యేది ఇక్కడే..!
Sritej | యువతి ఫిర్యాదు.. పుష్ప యాక్టర్ శ్రీతేజ్‌పై కేసు నమోదు
Rashmika Mandanna | అతడెవరో అందరికీ తెలుసు.. రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిపోయిన రష్మికమందన్నా