AR Rahman for NTR Movie | థియేటర్లో జూనియర్ ఎన్టీఆర్ సినిమా వచ్చి దాదాపు మూడేళ్లయింది. అరవింద సినిమా తర్వాత ఎన్టీఆర్ తన ఫోకస్ మొత్తం ట్రిపుల్ ఆర్ సినిమాపైనే పెట్టాడు. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ పూర్తయింది.. ఈ సినిమా కోసం వచ్చిన గ్యాప్‌ను ఇప్పుడు ఫిల్ చేయాలని ఫిక్సయ్యాడు. ఇందుకోసం వరుసగా సినిమాలను చేస్తున్నాడు. ట్రిపుల్ ఆర్ తర్వాత కొరటాలశివ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన లాంఛింగ్ కార్యక్రమాలు ఈ నెల 7న జరగనున్నాయి. వీటితో పాటుగా ఉప్పెన ఫేం బుచ్చి బాబుతో ఓ స్పోర్ట్స్ డ్రామా సినిమాను చేయనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలు పెట్టనున్నట్లు సమాచారం. మైత్రీ సంస్థతో కలిసి సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
ఉప్పెన తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న బుచ్చి బాబు ఎన్టీఆర్ సినిమా పనులను చక చక పూర్తిచేస్తున్నాడట. ఇప్పటికే నటీనటులను ఎంపికచేసే పనిలో ఉన్నారంట చిత్ర బృందం. ఇక ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహమాన్‌ను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తుంది. కొమరం పులి తర్వాత ఏఆర్ రెహమన్ ఇప్పటి వరకు తెలుగులో మరో సినిమా చేయలేదు. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా బుచ్చి బాబు ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడట..దీనికి ఏఆర్ రెహమాన్ తోడైతే సినిమాకు మరింత క్రేజ్ వస్తుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. ఇక ఇందులో నిజమొంతుందో తెలియాలంటే అధికారికంగా ప్రకటన రావాల్సిందే..
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీకపూర్.. ఇందులో నిజమెంత?
RRR కారణంగా ఎన్టీఆర్ ఎంత నష్టపోయాడో తెలుసా..?
అల్లు అర్జున్ తర్వాత సమంతకు జూనియర్ ఎన్టీఆర్ బంపర్ ఆఫర్..
ఆలియా భట్‌తో నటించడానికి తారక్ కంగారుపడ్డాడా?
ఉప్పెన 2 సినిమాపై దర్శకుడు బుచ్చి బాబు ఆసక్తికర వ్యాఖ్యలు