పది కోట్ల వీక్షణానందం

“సారంగదరియా’ పాట విజయం ఊహించిందే. అయితే ఇంత భారీ స్పందన లభిస్తుందని అనుకోలేదు. లిరికల్ వీడియో వంద మిలియన్ల వ్యూస్ సాధించడం ఆనందంగా ఉంది’ అని అన్నారు దర్శకుడు శేఖర్ కమ్ముల. ఆయన దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘లవ్‌స్టోరి’. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్నారు. నారాయణ్ దాస్ కె నారంగ్, పి.రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. ఈ నెల 16న విడుదలకానుంది. ఈ చిత్రంలోని ‘సారంగదరియా’ పాట యూట్యూబ్‌లో 32 రోజుల్లోనే వంద మిలియన్ల వ్యూస్‌ను సాధించింది. ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల మాట్లాడుతూ ‘మూడేళ్ల క్రితమే ‘సారంగదరియా’ పాట విన్నా. అవకాశం వచ్చినప్పుడు సినిమాలో ఉపయోగించాలనుకున్నా. సందర్భం, సీన్ కుదరడంతో ‘లవ్‌స్టోరి’లో ఈ పాటను తీసుకున్నాం. జానపద గీతానికి తనదైన ముద్రతో సుద్దాల అశోక్‌తేజ అద్భుతంగా సాహిత్యాన్ని అందించారు. కొత్త పదప్రయోగాలు చేశారు. ఫోక్ శైలిని అర్థం చేసుకుంటూ పవన్ చక్కటి బాణీలను సమకూర్చారు. మంగ్లీ పాడిన విధానం, శేఖర్ మాస్టర్ నృత్యాలు చక్కగా కుదిరాయి. ఈ లిరికల్ గీతానికి మించి పదింతల ఆదరణ వీడియో సాంగ్‌కు వస్తుందని నమ్ముతున్నాం. సినిమా అందరి అంచనాలను అందుకుంటుంది’ అని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

