ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీస్టారర్ చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్ఆర్ఆర్). చారిత్రక అంశాలకు ఫిక్షన్‌ను జోడించి తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్ కీలక పాత్రను పోషిస్తున్నారు. శుక్రవారం అజయ్ దేవ్‌గణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ వీడియోలో అజయ్దేవ్గణ్ను సైనికులు చుట్టుముడుతుండగా వారితో పోరాటానికి సిద్ధమై చేతులు చాస్తూ ధీరోదాత్తుడిగా ఆయన కనిపిస్తున్నారు.
‘లోడ్..ఏయిమ్..షూట్…ప్రజలను చైతన్యవంతం చేస్తూ ప్రజాసేవలోనే తన బలాన్ని చూసుకునే వ్యక్తి’ అంటూ దర్శకుడు రాజమౌళి మోషన్ పోస్టర్‌ను ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. ఈ సినిమాలో తొలితరం స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ కనిపించబోతున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానున్నది.
ఇవి కూడా చదవండి..