ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం
ఏపీ మాజీ మంత్రి విడదల రజినిపై పోలీసులు దురుసుగా ప్రవర్తించడం తీవ్ర చర్చనీయాంశ మైంది. మూడు రోజులుగా ఆమెను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. ఆమెను కలిసేందుకు వైసీపీ శ్రేణులు రాకుండా పోలీసులు ఆంక్షలు విధించారు.
- వైసీపీ మాజీ మంత్రిని కిందపడేసిన ఎస్సై
హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ) : ఏపీ మాజీ మంత్రి విడదల రజినిపై పోలీసులు దురుసుగా ప్రవర్తించడం తీవ్ర చర్చనీయాంశ మైంది. మూడు రోజులుగా ఆమెను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. ఆమెను కలిసేందుకు వైసీపీ శ్రేణులు రాకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. ఎడ్లపాడు జడ్పీటీసీ అభ్యర్థి బుల్లబ్బాయి తనను కలిసేందుకు రాగా, విడదల రజినీ ఇంటి నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న చిలకలూరిపేట రూరల్ ఎస్సై ప్రియాంక ఆమెను అడ్డుకున్నారు.
ఈ క్రమంలో ఎస్సై విడదల రజినిపై దౌర్జన్యానికి దిగారు. బయటకు వెళ్లకుండా ఎస్ఐ గట్టిగా నెట్టేయడంతో ఒక్కసారిగా ఆమె కిందపడిపోయారు. ఎస్సై తీరుపై రజని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘నీకు పిచ్చిపట్టిందా? నన్ను చంపేస్తవా? అసలు నిన్ను ఇక్కడికి ఎవరు పంపారు? అంటూ ఎస్ఐపై రజిని మండిపడ్డారు. ఇప్పుడు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

