ఆర్ఆర్ఆర్ (RRR)..మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద రికార్డుల వర్షం కురిపిస్తోంది. రాంచరణ్, ఎన్టీఆర్ (NTR) లీడ్ రోల్స్ లో నటించారు. ఆర్ఆర్ఆర్లో ప్రత్యేకించి ఎన్టీఆర్ యాక్టింగ్ కి అందరూ ఫిదా అయిపోతున్నారు. ఆర్ఆర్ఆర్ సక్సెస్ ఫుల్‌గా స్క్రీనింగ్ అవుతున్న నేపథ్యంలో హిందీ మీడియాతో చిట్ చాట్ చేశాడు ఎన్టీఆర్. చిట్‌చాట్‌లో తారక్‌ను పొలిటికల్ ఎంట్రీ (NTR political entry) గురించి ఓ రిపోర్టర్ ప్రశ్నించాడు.
దీనికి ఎన్టీఆర్ స్పందిస్తూ..ప్రస్తుతానికి ఓ నటుడిగా ఈ ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తున్నానని చెప్పాడు. మరు క్షణంలో ఏం జరుగుతుందో తెలియనపుడు భవిష్యత్ లో రాజకీయాలపై ఎలా అంచనా వేయగలమన్నాడు. అంతేకాదు ఓ యాక్టర్‌గా సవాళ్లను ఎదుర్కోవడాన్ని తానెంతో ప్రేమిస్తానని, తన రాజకీయ భవిష్యత్ గురించి ఆలోచించే సమయం లేదని ముగించాడు ఎన్టీఆర్. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ రోజురోజుకీ బలహీన పడుతుండటంతో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటూ చాలా మంది అభిమానులు కోరుకుంటున్న విషయం తెలిసిందే.
ఎన్టీఆర్ త్వరలో కొరటాల శివతో (NTR 30) ప్రాజెక్టును మొదలుపెట్టనున్నాడు. జనతాగ్యారేజ్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి