మంగళవారం 01 డిసెంబర్ 2020
Cinema - Oct 30, 2020 , 09:19:47

క్షీణించిన నోయ‌ల్ ఆరోగ్యం.. హౌజ్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చేసిన సింగ‌ర్

క్షీణించిన నోయ‌ల్ ఆరోగ్యం.. హౌజ్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చేసిన సింగ‌ర్

ఇప్ప‌టికే అనారోగ్యం కార‌ణంగా బిగ్ బాస్ నుండి గంగ‌వ్వ బ‌య‌ట‌కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ర్యాప్ సింగ‌ర్ నోయ‌ల్ కూడా అనారోగ్యంతో హౌజ్‌ను వీడాడు. ఆర్ధ‌రైటిస్‌తో బాధ‌పడుతున్న నోయ‌ల్ చాలా ఇబ్బంది ప‌డుతున్నాడు. మొద‌టల్లో బాగానే ఉన్నా రాను రాను అత‌ని ఆరోగ్య ప‌రిస్థితి మ‌రింత క్షీణించింది. న‌డ‌వ‌లేని ప‌రిస్థితిలో ఉండ‌డంతో బీబీ డే కేర్ టాస్క్ నుండి అత‌నికి విశ్రాంతినిచ్చారు బిగ్ బాస్‌.

నోయ‌ల్ ఆరోగ్యంకి సంబంధించి ప‌లు ప‌రీక్ష‌లు చేసిన డాక్ట‌ర్ అత‌నికి మంచి వైద్యం అందించేందుకు బ‌య‌ట‌కు పంపాల‌ని చెప్పారు. దీంతో బిగ్ బాస్‌.. నోయ‌ల్‌ను హౌజ్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చేయాల‌ని అన్నారు. ఇదే విష‌యాన్ని నోయ‌ల్ ఇంటి స‌భ్యుల‌తో షేర్ చేయ‌గా, వారంద‌రు క‌న్నీటి ప‌ర్యంత‌మయ్యారు. ముఖ్యంగా హారిక అత‌నిని ప‌ట్టుకొని ఎమోష‌న‌ల్ అయింది. అభిజిత్‌, సోహైల్‌లు అత‌నికి ధైర్యాన్ని అందించారు.

హౌజ్‌ను భారంగా వీడుతున్న స‌మ‌యంలో నోయ‌ల్‌.. మీరు త్వ‌ర‌గా కోలుకొని బిగ్ బాస్ హౌజ్‌లో అడుగుపెడ‌తార‌ని ఆశిస్తున్నాం అన‌డంతో హారిక‌తో పాటు మిగతా ఇంటి స‌భ్యులు మీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం అని ధైర్యం అందించారు. అయితే హారిక మాత్రం నోయల్ వెళ్లిపోయినా ఆ డోర్ దగ్గరే ఉండిపోయి.. ఐ లవ్ యూ అంటూ అరుస్తూ తెగ ఏడ్చేసింది.ఇక ఈ రోజు ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఇంటి స‌భ్యుల‌ని జంటలుగా విడ‌గొట్టి వాళ్ళకు పెద్ద ప‌రీక్ష‌లే పెట్టారు. అవేంటో నేటి ఎపిసోడ్ చూస్తే అర్ద‌మ‌వుతుంది.