శనివారం 24 అక్టోబర్ 2020
Cinema - Oct 17, 2020 , 08:12:50

గేమ్ నుండి త‌ప్పుకున్న నోయ‌ల్‌.. ఎంట్రీ ఇచ్చిన అవినాష్‌

గేమ్ నుండి త‌ప్పుకున్న నోయ‌ల్‌.. ఎంట్రీ ఇచ్చిన అవినాష్‌

బిగ్ బాస్ సీజ‌న్ 4 కార్య‌క్ర‌మంలో గురువారం ఎపిసోడ్ స‌ర‌దాగా సాగింది. ముందుగా అరియానా, అవినాష్‌లు ఇంటి శుభ్ర‌త గురించి చ‌ర్చించ‌గా, ఆ త‌ర్వాత మోనాల్ కూడా గిన్నెలు స‌రిగ్గా క్లీన్ చేయ‌ట్లేద‌ని కెమెరాకు చెప్పింది. ఆ త‌ర్వాత బిగ్ బాస్ ఇంటి స‌భ్యుల‌కు రేస‌ర్ ఆఫ్ ద హౌజ్ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో రెండు రౌండ్స్ ఉండ‌నుండ‌గా, మొద‌టి రౌండ్‌లో ఎక్కువ పుషప్స్ చేసిన ఇంటి స‌భ్యులు రెండో రౌండ్‌కు అర్హ‌త సాధిస్తారు. 

రెండో రౌండ్‌కు వెళ్ళిన వారు ఏడు అడ్డంకుల‌ను త‌క్కువ స‌మ‌యంలో దాటాల్సి ఉంటుంది. టైర్ల మ‌ధ్య నుంచి న‌డవ‌డం, తాళ్ల మ‌ధ్య‌లో నుంచి దాట‌డం, ఇసుక మూట‌ల‌ను స్విమ్మింగ్ పూల్‌లో ఒక‌వైపు నుంచి మ‌రొక‌వైపుకు తీసుకెళ్ల‌డం, ఏట‌వాలుగా ఉన్న‌దానిపై న‌డ‌వ‌డం, ముళ్ల కంచె కింద నుంచి పాకడం, మార్బుల్స్ మీద ప‌రిగెత్త‌డం, మంకీ బాస్‌ను చేతులతో ప‌ట్టుకుని వేలాడ‌టం, ఆ త‌ర్వాత బైక్‌పై కూర్చొని ఫోటోకు ఫోజులివ్వ‌డం చేయాల్సి ఉంటుంది.

అమ్మ రాజ‌శేఖ‌ర్ ఈ టాస్క్‌కు సంచాల‌కుడిగా ఉండ‌గా, మిగ‌తా వారంద‌రు తొలి రౌండ్‌లో పాల్గొన్నారు. అమ్మాయిలు పుష‌ప్స్ ఎక్కువ సేపు చేయ‌క‌పోవ‌డంతో త‌ప్పుకున్నారు. చివ‌రి వ‌ర‌కు అఖిల్‌, నోయ‌ల్‌, మెహ‌బూబ్, సోహైల్‌, కుమార్ సాయి పుష‌ప్స్  చేస్తూ ఉండ‌డంతో వీరిని రెండో రౌండ్‌కు పంపారు. అయితే కుమార్ సాయి త‌ప్పు గేమ్ ఆడాడ‌ని నోయ‌ల్ వాదించ‌గా, నేను క‌రెక్టే ఆడానంటూ కుమార్ సాయి చెప్పుకొచ్చాడు. ఇద్ద‌రి మ‌ధ్య కొద్ది సేపు వాద‌న జ‌రిగిన త‌ర్వాత నోయ‌ల్ తాను రెండో రౌండ్‌లో పాల్గొన‌నంటూ అబిజిత్‌కు చెప్పాడు.

నోయ‌ల్ త‌ప్పుకోవ‌డంతో ఆయ‌న స్థానంలో అవినాష్ రంగంలోకి దిగారు. రెండో రౌండ్‌కు అభిజిత్ సంచాల‌కుడిగా ఉండ‌గా, తొలి కంటెస్టెంట్‌గా కుమార్ సాయి వ‌చ్చాడు. ఆ త‌ర్వాత అఖిల్‌, అవినాష్‌, సోహైల్, మెహ‌బూబ్ టాస్క్‌లో పాల్గొన్నారు. అంద‌రి క‌న్నా త‌క్కువ స‌మ‌యంలో టాస్క్ పూర్తి చేసిన మెహ‌బూబ్‌ "రేస‌ర్ ఆఫ్ ద హౌస్‌"గా నిలిచాడు. నువ్వు నిజంగా రేసు గుర్రం అంటూ ఇంటి స‌భ్యులు అత‌నిని అభినందించారు. ఇక ఆ తర్వాత అఖిల్‌, సోహైల్‌ల మ‌ధ్య కొంత సేపు డిస్క‌ష‌న్ జ‌రిగింది. నేను 101 పుషప్స్ చేస్తే దానిని మెహ‌బూబ్ వెట‌కారంగా మాట్లాడాడు అంటూ ఫీల‌య్యాడు.

అఖిల్ బాధ‌ప‌డుతున్న విష‌యాన్ని సోహైల్‌.. మెహ‌బూబ్ ద‌గ్గ‌ర చెప్ప‌గా మెహ‌బూబ్ వ‌చ్చి అఖిల్‌కు సారీ చెప్పాడు. అయిన‌ప్ప‌టికీ అఖిల్ ఆ ఫ్ర‌స్ట్రేష‌న్ నుండి కొంత సేప‌టి వ‌ర‌కు బ‌య‌ట‌కు రాలేక‌పోయాడు.  logo