మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల నేపథ్యంలో తెలుగు చిత్రపరిశ్రమలో మరోసారి నాన్‌లోకల్ అంశం తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. మా అధ్యక్షబరిలో నలుగురు నిలబడగా..వీరిలో ప్రకాశ్ రాజ్ నాన్ -లోకల్ అంటూ కొందరు ప్రత్యర్థులు తమ వాయిస్ ను లేవనెత్తారు. అయితే ప్రకాశ్ రాజ్ కు పలువురు మద్దతుగా నిలిచారు. తాజాగా మరో నటుడు సుమన్ (నాన్ లోకల్) ప్రకాశ్ రాజ్‌కు మద్దతు పలికారు. ప్రకాశ్ రాజ్ నాన్ లోకల్ కాదని సుమన్ అన్నారు.
సినీ పరిశ్రమలో ఎవరూ నాన్ లోకల్ కాదని, సినీ ఆర్టిస్టులు అన్ని రాష్ట్రాలకు చెందిన వారని సుమన్ స్పష్టం చేశారు. ప్రకాశ్ రాజ్, సుమన్ ల మధ్య ఉన్న కామన్ థింగ్ ఏంటంటే. ఇద్దరూ కర్ణాటకకు చెందిన వారే. ఈ ఇద్దరూ తమ నటనతో కోట్లాది మంది తెలుగు అభిమానులను సంపాదించుకున్నారు. ముందు నుంచి సుమన్ తెలంగాణకు సపోర్టుగా నిలిచారు. ప్రకాశ్ రాజ్ తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యారని, ఇక్కడే ఇళ్లు కూడా ఏర్పాటు చేసుకుని ఇక్కడ ప్రజలతో కలిసిపోయారని ఇప్పటికే నిర్మాత బండ్ల గణేశ్ కుండ బద్దలు కొట్టారు.
ఇవి కూడా చదవండి..
రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతారు..రష్మికకు అభిమాని ప్రశ్న
నాలో మూడు మార్పులొచ్చాయి : సమంత
వెకేషన్ డేస్‌ను గుర్తు చేసుకున్న రకుల్..స్టిల్స్ వైరల్
ప్రభాస్ టు సాయిపల్లవి..సౌతిండియా స్టార్లు ఏం చదివారో తెలుసా..?
ఈ స్టార్ హీరోకు పాపులర్ హీరోయిన్ కావాలట..!
ఫాలోవర్లు, ఫ్యాన్స్ కు కొరటాల శివ షాక్