Macherla Niyojakavargam | సుదీర్ఘ విరామం తర్వాత నితిన్ యాక్షన్ బాట పట్టారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ మాచర్ల నియోజకవర్గం ’. ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి నిర్మాత. శ్రేష్ట్ మూవీస్ పతాకంపై సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డి నిర్మిస్తున్నారు. కృతిశెట్టి కథానాయిక. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతున్నది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 29న విడుదల చేయబోతున్నారు.
ఈ సందర్భంగా శుక్రవారం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో నితిన్ శక్తివంతంగా కనిపిస్తున్నారు. ‘రాజకీయాంశాలు కలబోసిన వాణిజ్య చిత్రమిది. నితిన్ గతంలో చూడని విధంగా కొత్త అవతారంలో కనిపిస్తారు. పొలిటికల్ బ్యాడ్డ్రాప్లో నడిచే ఈ సినిమాలో ప్రేమకథ కూడా మెప్పిస్తుంది. ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి కెమెరా: ప్రసాద్ మూరెళ్ల, సంగీతం: మహతి స్వరసాగర్, ఆర్ట్: సాహి సురేష్, మాటలు: మామిడాల తిరుపతి, సమర్పణ: రాజ్‌కుమార్ ఆకెళ్ల, రచన, దర్శకత్వం: ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పవన్ కళ్యాణ్‌తో నితిన్ పోటీ.. తెలిసి చేశాడా.. తెలియక చేశాడా..?
Brahmanandam Rejection | బ్రహ్మానందంను సినిమా నుంచి తొలగించిన నితిన్..?
Nithiin | మొన్న సాయి ధరమ్ తేజ్.. ఇప్పుడు నితిన్ !!
Pooja Hegde | వారి కోసం కాల్షీట్లు లేవంటున్న పూజాహెగ్డే..!
Nithiin | ప్రేమ కథలు చేయను..ట్రోలింగ్ చేస్తారు: నితిన్