బాలీవుడ్ (Bollywood)బ్యూటీ ప్రియాంకా చోప్రా (Priyanka Chopra), అమెరికన్ సింగర్ నిక్ జోనస్ (Nick Jonas ) ను పెళ్లి చేసుకున్న తర్వాత ఇండియాకు దూరమైన విషయం తెలిసిందే. తన భర్త నిక్ జోనస్ అండ్ ఫ్యామిలీతో యూఎస్‌లో ఆనందకర క్షణాలను గడుపుతోంది. కాగా ఇటీవలే నిక్ జోనస్‌తో ఉన్న బంధాన్ని ప్రియాంక చోప్రా తెంచుకోబోతుందంటూ ఓ వార్త బీటౌన్‌లో హల్ చల్ చేసింది. అయితే ఈ గాసిప్స్ కు ప్రియాంక నిక్ కపుల్ కొట్టిపారేశారు.
ఇవాళ మూడో వివాహ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకొని వాటికి పుల్ స్టాప్ పెట్టారు. తాజాగా ఓ క్రేజీ అప్ డేట్ బయటకు వచ్చింది. నిక్ జోనస్ బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్దం చేసుకున్నట్టు బాలీవుడ్ లో ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది. తాను త్వరలోనే ఓ హిందీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నానని, ప్రస్తుతం దానిపైనే వర్క్ చేస్తున్నానని నిక్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. మరి నిక్ జోనస్ బాలీవుడ్ తెరంగేట్రం ఎలాంటి సినిమాతో ఉండబోతుందో చూడాలి.
ఇవి కూడా చదవండి..
Ruhani Sharma | చిలసౌ హీరోయిన్ బాలీవుడ్ ఎంట్రీ !
Mahesh Chiranjeevi Donations | ఏపీ వరద బాధితులకు చిరంజీవి, మహేశ్‌బాబు భారీ విరాళం
Mahesh Chiranjeevi Donations | ఏపీ వరద బాధితులకు చిరంజీవి, మహేశ్‌బాబు భారీ విరాళం
Sirivennela Last wish | చివరి వరకు సిరివెన్నెలకు ఆ ఒక్క కోరిక అలాగే మిగిలిపోయింది..
shiva shankar master | వెన్నెముక గాయం.. ఎనిమిదేళ్లు మంచంపైనే.. అయినా 800 సినిమాలకు కొరియోగ్రఫీ