టాలీవుడ్ (Tollywood) హీరోలు దగ్గుబాటి వెంకటేశ్ (Venkatesh), రానా (Rana) కాంబోలో వస్తున్న నెట్ఫ్లిక్స్ (Netflix) సిరీస్ రానా నాయుడు (Rana Naidu). తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టు అమెరికన్ హిట్ సిరీస్ రే డోనోవ్యాన్కు అడాప్షన్గా వస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. రానా నాయుడు షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు సోషల్ మీడియా ద్వారాప్రకటించారు.
మీర్జాపూర్, ది ఫ్యామిలీ మ్యాన్ ఫేం సుపన్ వర్మ, కరణ్ అన్షుమాన్ ఈ నెట్ ఫ్లిక్స్ సిరీస్ ను డైరెక్ట్ చేస్తున్నారు. వెంకటేశ్ నటించిన ఎఫ్ 3 మే 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు వేణు ఊడుగుల డైరెక్షన్లో రానా నటిస్తోన్న విరాట పర్వం జులై 1న విడుదల కానుంది. గతంలో వెంకీ-రానా కాంబోలో గతంలో కృష్ణం వందే జగద్గురుమ్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీలో ఓ సాంగ్లో రానాతో స్టెప్పులేశాడు.
సుందర్ ఆరన్ ఆఫ్ లోకొమోటివ్ గ్లోబల్ మీడియా ఎల్ఎల్పీ నిర్మిస్తోన్న ఈ సిరీస్ క్రైం డ్రామా నేపథ్యంలో వస్తోంది. మేకర్స్ త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.