Actor Anant Nag | కన్నడ లెజెండ్ యాక్టర్ అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
Actor Anant Nag | ప్రముఖ నటుడు (Noted Actor), బహుముఖ ప్రజ్ఞాశాలి అనంత్ నాగ్ (Anant Nag) కు కేంద్ర ప్రభుత్వం (Union Govt) భారతీయ చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే (Dada Saheb Phalke) అవార్డును ప్రకటించింది. 2024 సంవత్సరానికిగాను భారతీయ సినిమాకు ఆయన అందించిన విశేష సేవలను గుర్తిస్తూ ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారానికి ఎంపిక చేసినట్లు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) అధికారికంగా వెల్లడించింది.
Actor Anant Nag : ప్రముఖ నటుడు (Noted Actor), బహుముఖ ప్రజ్ఞాశాలి అనంత్ నాగ్ (Anant Nag) కు కేంద్ర ప్రభుత్వం (Union Govt) భారతీయ చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే (Dada Saheb Phalke) అవార్డును ప్రకటించింది. 2024 సంవత్సరానికిగాను భారతీయ సినిమాకు ఆయన అందించిన విశేష సేవలను గుర్తిస్తూ ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారానికి ఎంపిక చేసినట్లు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) అధికారికంగా వెల్లడించింది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఎంపిక కమిటీ సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
సెప్టెంబర్ 22న గుజరాత్‌లోని కెవాడియాలో జరగనున్న 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రధానోత్సవంలో అనంత్ నాగ్ ఈ అవార్డును అందుకోనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా అనంత్ నాగ్‌కు అభినందనలు తెలిపారు. అద్భుతమైన నటన, వైవిధ్యమైన పాత్రలతో, ముఖ్యంగా కన్నడ చిత్రసీమలో ఆయన చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ఈ గౌరవానికి ఆయన అన్ని విధాలా అర్హులని ప్రధాని పేర్కొన్నారు.
1948 సెప్టెంబర్ 4న జన్మించిన అనంత్ నాగ్ (అనంత్ నాగర్కట్టె) తన సుదీర్ఘ కెరీర్లో 300కు పైగా చిత్రాల్లో నటించారు. వీటిలో 250కి పైగా కన్నడ చిత్రాలే ఉన్నాయి. ఆయన కన్నడతోపాటు హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, మలయాళం, ఇంగ్లీష్ భాషల్లోనూ తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. వెండితెరపైనే కాకుండా ఆర్కే నారాయణ్ కథల ఆధారంగా దూరదర్శన్‌లో ప్రసారమైన ‘మాల్గుడి డేస్’ సీరియల్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.
తన నటనకుగాను ఐదుసార్లు కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలు అందుకున్న అనంత్ నాగ్‌ను గత ఏడాది భారత ప్రభుత్వం దేశంలోని మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్‌తో సత్కరించింది. దశాబ్దాలుగా భారతీయ సినిమాకు ఆయన చేస్తున్న సేవలకు ఫాల్కే అవార్డు సరైన గౌరవమని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nagarjuna Sagar | నాగార్జునసాగర్ డ్యాం ఎడమ కాలువకు నీటి విడుదల చేసిన ఎన్ఎస్పీ అధికారులు
Varanasi | ‘వారణాసి’లో రామాయణ ఘట్టమే హైలైట్.. రాజమౌళి స్వయంగా తీసుకున్న సవాల్ ఇదే!
Ponnam Prabhakar | ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గుతాయా? కీలక విషయాలను వెల్లడించిన పొన్నం ప్రభాకర్
Karepalli | అధిక లోడుతో సుబాబుల్ లారీలు.. గ్రామాల మీదుగా యథేచ్ఛగా రవాణా!
Naresh | పెళ్లి చేసుకున్నా, చేసుకోకపోయినా పర్వాలేదు.. పిల్లల్ని మాత్రం కనండి: నటుడు నరేశ్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

