Eleven | అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నవీన్‌చంద్ర (naveen chandra). ఓ వైపు క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే.. మరోవైపు లీడ్ రోల్స్‌లో నటిస్తున్నాడు. నవీన్‌చంద్ర ప్రధాన పాత్రలో నటిస్తోన్న ప్రాజెక్ట్ లెవన్ (Eleven). లోకేశ్ అజిల్స్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా వస్తోంది. శశాంక్ మరో లీడ్ రోల్లో నటిస్తున్నాడు. ఇప్పటికే లాంచ్ చేసిన టీజర్.. వరుస హత్యలు చేస్తున్న హంతకుడిని పట్టుకునే నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్టు చెబుతోంది.
హంతకుడిని పట్టుకునే పోలీసాఫీసర్ పాత్రలో నవీన్ చంద్ర కనిపించబోతున్నట్టు టీజర్ ద్వారా హింట్ ఇచ్చేశాడు డైరెక్టర్. తాజాగా లెవన్ వర్కింగ్ స్టిల్స్ షేర్ చేశారు మేకర్స్. సినిమా శశాంక్, నవీన్ చంద్ర రోల్స్ చాలా సీరియస్‌గా ఉండబోతున్నట్టు స్టిల్స్ ద్వారా తెలుస్తోంది. అభిరామి, నవీన్ చంద్ర, శశాంక్ అండ్ టీంకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి.
వరుస హత్యల వెనక ఎవరున్నారనేది సస్పెన్స్‌లో పెడుతూ.. హత్యలను చేధించే క్రమంలో సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో సినిమా సాగనున్నట్టు టీజర్ చెబుతోంది. లెవన్ చిత్రంలో రెయా హరి, శశాంక్, అభిరామి, దిలీపన్, రిత్విక, రవి వర్మ, కిరీటి దామరాజు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ నవంబర్‌లో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుండగా.. రిలీజ్ డేట్‌పై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
లెవన్ వర్కింగ్ స్టిల్స్..
Here’s are the making stills from the Edge of the seat Thriller #ELEVEN ❤️🔥
IN WW THEATERS THIS NOVEMBER 💥 pic.twitter.com/nCcMq0VNIq
— BA Raju’s Team (@baraju_SuperHit) October 23, 2024
Anushka Shetty | సైలెంట్ మోడ్‌లో అనుష్కా శెట్టి ఘాటి షూటింగ్..!
Sonam Kapoor | నీరవ్ మోదీ స్టోర్‌ను భారీ మొత్తానికి కొన్న సోనమ్ కపూర్
War 2 | హృతిక్ రోషన్ వర్సెస్ తారక్ .. వార్ 2లో అదిరిపోయే కత్తిసాము సీక్వెన్స్
లెవన్ టీజర్..