Rashmika Mandanna | బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్నా కాంబోలో వచ్చిన చిత్రం థామా (Thamma). హార్రర్ సినిమాటిక్ యూనివర్స్‌లో మ్యాడ్ డాక్ ఫిలిమ్స్ తెరకెక్కించిన ఈ మూవీ అక్టోబర్ 21న విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. మరోవైపు ఇటీవలే తెలుగులో ది గర్ల్‌ఫ్రెండ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా మంచి టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది. బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌లతో ఫుల్ జోష్ మీదున్న రష్మిక ఓ ఆసక్తికర విషయాన్ని అభిమానులు, ఫాలోవర్లతో షేర్ చేసుకుంది.
తన ఫిల్మోగ్రఫీలో భిన్నమైన సినిమాలుండేలా ప్లాన్ చేసుకునే రష్మిక కొరియన్ సినిమా చేయడంపై అడిగిన ప్రశ్నకు స్పందించింది. అవును.. కొరియన్ డ్రామా చేయాలనుకుంటున్నా. అవి చాలా ఫన్‌గా ఉంటాయి. కానీ వాళ్లు (మేకర్స్)నాకు ఏం ఇస్తున్నారనే దానిపై కూడా ఇది ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే నేను స్క్రీన్‌పై ఏం చేయగలనో మీకు తెలుసు.. కథ నాకు సెట్ అవుతుందనిపిస్తే కొరియన్ ప్రాజెక్ట్ చేసేందుకు రెడీనంటూ చెప్పుకొచ్చింది.
నాకు కొరియన్ సినిమాలపై ప్రేమ కోవిడ్టైంలోనే మొదలైంది. కోవిడ్ సమయంలో నా చేతిలో చాలా టైం ఉంది కాబట్టి కొరియన్ డ్రామాల గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. ప్రతీ కొరియన్ డ్రామా 16 ఎపిసోడ్స్‌గా ఉంటుంది. అంటే మీరు ఒక కొరియన్ ప్రాజెక్ట్‌ను స్క్రీన్‌పై చూడాలంటే రోజులో 16 గంటలు కేటాయింవచ్చన్నది రష్మిక మందన్నా. ఈ కామెంట్స్‌తో ఇక రాబోయే కాలంలో కొరియన్ సినిమాలు కూడా చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని రష్మిక హింట్ ఇచ్చేస్తుంది.
Sigma | విజయ్ తనయుడు డెబ్యూ మూవీ.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్ పోస్టర్
Govinda | గోవిందా భార్య సంచలన వ్యాఖ్యలు .. ఇంకో జన్మ ఉంటే గోవిందా నా భర్తగా వద్దు ..
Suma | పాడ్‌కాస్ట్‌లో విడాకులపై క్లారిటీ ఇచ్చిన సుమ.. కలిసి కనిపించిన విడిపోలేదా అనే వారు