Ram Charan | కన్నడ స్టార్ యాక్టర్ శివరాజ్‌కుమార్ హీరోగా నార్తన్ డైరెక్ట్ చేసిన Mufti బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. రీసెంట్గా ఈ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన భైరథి రణగల్తో మరో హిట్టందుకున్నాడు నార్తన్ (Narthan). కాగా ఈ టాలెంటెడ్ డైరెక్టర్ నెక్ట్స్ సినిమాపై చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. నా కొత్త ప్రాజెక్టు కేవీఎన్ ప్రొడక్షన్స్ తో చేయబోతున్నా. కానీ హీరోపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
లీడ్ రోల్ కోసం సూర్య, రాంచరణ్ Ram Charan పేర్లను పరిశీలిస్తున్నాం. కన్నడ యాక్టర్ పేరు కూడా ఉంది. హీరోను ఫైనల్ చేసిన తర్వాత ప్రొడక్షన్ హౌస్ నుంచి అధికారిక ప్రకటన చేస్తామని చెప్పాడు నార్తన్. రాంచరణ్ నార్తన్‌తో సినిమా చేయబోతున్నాడని చాలా కాలంగా పుకార్లు తెరపైకి వస్తున్నా.. ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ఇప్పుడిక నార్తన్ టాలీవుడ్ యాక్టర్ రాంచరణ్ పేరు ప్రస్తావించడంలో దాదాపు ఈ ప్రాజెక్ట్‌లో ఫైనల్ అయిపోయినట్టేనని అభిమానులు తెగ ఎక్జయిట్ అవుతున్నారు.
రాంచరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఆర్సీ 16 సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. మరోవైపు సూర్య ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజు, ఆర్జే బాలాజీ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో మరి ఇద్దరిలో ఏ యాక్టర్ ముందుగా నార్తన్కు డేట్స్ కేటాయిస్తాడన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Dir #Narthan Recent Interview ✅
– Immediately after the completion of #Ranagal, actors #Suriya and #Ramcharan were approached for my next film.
– This film is produced by KVN.
– Who will act in it will be announced in February.#Suriya46
pic.twitter.com/ZwK2jVUANw— Movie Tamil (@MovieTamil4) November 26, 2024
Ram Gopal Varma | రాంగోపాల్ వర్మ ట్వీట్.. కోయంబత్తూరుకు ఏపీ పోలీసులు..!
Suriya 45 | సూర్య 45 పూజా సెర్మనీ టైం.. షూటింగ్ మొదలయ్యేది ఇక్కడే..!
Sritej | యువతి ఫిర్యాదు.. పుష్ప యాక్టర్ శ్రీతేజ్‌పై కేసు నమోదు
Rashmika Mandanna | అతడెవరో అందరికీ తెలుసు.. రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిపోయిన రష్మికమందన్నా