గతంలో ఎన్నడూ లేని విధంగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో నలుగురు అధ్యక్ష బరిలో నిలబడే సరికి అందరి అటెన్షన్ పడ్డది. ‘మా’ ఎన్నికలపై మీడియా ముందు పలువురు నటీనటులు ఎవరి అభిప్రాయాలు వారు చెప్పారు. అయితే ‘మా’ ఎన్నికలు ఎప్పుడు జరుగబోతున్నాయని ఇటీవలే ప్రకాశ్ రాజ్ పెట్టిన ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. దీనిపై సీనియర్ నటుడు నరేశ్ జూన్ లో ‘మా’ సభ్యుల జనరల్ బాడీ మీటింగ్ లో సిద్దం చేసిన కాపీని జతచేస్తూ..వ్యంగ్యంగా రిప్లై ఇచ్చారు.
ఎవరో పదే పదే ఎప్పుడు ఎన్నికలు అని అడుగుతుంటే..? స్విమ్మింగ్ ఫూల్లో నీటిని నింపకముందే అందులో దూకమంటారా..? అని అడిగినట్టుంది. ఇదే మా సమాధానం..దయచేసి ప్రయత్నించండి సార్ అంటూ నరేశ్ సెటైరికల్ గా స్పందించారు. అయితే నరేశ్ సమాధానంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కొందరు నెటిజన్లు..ప్రకాష్ రాజ్ వ్యక్తిగత వివరాలను ప్రస్తావించిన కాపీని బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందని కామెంట్లు పెట్టారు. ‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, జీవితారాజశేఖర్, హేమ పోటీ చేస్తుండగా..నటుడు, లాయర్ సీవీ ఎల్ నరసింహరావు కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు.
ఎలక్షన్స్ ఎప్పుడు…?…… #justasking
— Prakash Raj (@prakashraaj) July 6, 2021
After a clear reply frm MAA reg election (copy enclosed) that a Resolution wz passd in general body & in view of Covid, If someone just asks repeatedly wn is da election? Its like someone asking can I jump into da pool before the water is filled. Our reply wud b pls try sir pic.twitter.com/bDkfx1AoO4
— H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) July 7, 2021
ఇవి కూడా చదవండి..
100 సార్లు నన్ను రిజెక్ట్ చేశారు..వారికి నా సమాధానమదే: దివి
శ్రియా శరణ్ కథక్ డ్యాన్స్ కు ఫ్యాన్స్ ఫిదా..వీడియో
భర్తతో పబ్లిక్ రొమాన్స్..శ్రియపై నెటిజన్ల సెటైర్లు
పాపులర్ బ్రాండ్ తో ‘అందాల రాక్షసి’ డీల్
విడుదలకు ముందే ఖర్చులు వచ్చేశాయి..!
చీరలో ఆదాశర్మ మార్షల్ ఆర్ట్స్..వీడియో వైరల్