కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తుండడంతో గతంలో రిలీజ్ డేట్ ప్రకటించుకున్న చిత్రాలు ఒక్కొక్కటిగా వాయిదా పడుతున్నాయి. ఇప్పటికే లవ్ స్టోరీ, విరాట పర్వం, ఆచార్యతో పాటు పలు తెలుగు, తమిళం, హిందీ చిత్రాలు వాయిదా పడగా ఇప్పుడు విక్టరీ వెంకటేష్- ప్రియమణి జంటగా నటించిన నారప్ప చిత్రం రిలీజ్ తాత్కాలికంగా వాయిదా పడింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అఫీషియల్‌గా ప్రకటించింది.
మే 14న నారప్ప చిత్రం థియేటర్స్‌లో విడుదల కావలసి ఉంది. కాని కరోనా వలన ఈ చిత్రం ఓటీటీలో విడుదల అవుతుందని కొన్నాళ్లుగా ప్రచారం నడిచింది. అయితే అవన్నీ పుకార్లు అని కొట్టి పారేసిన చిత్ర బృందం ‘నారప్ప’ సినిమాని పోస్ట్‌పోన్ చేస్తున్నట్టు అధికారకంగా వెల్లడించారు. పరిస్థితులు చక్కబడిన తర్వాత మళ్ళీ అధికారకంగా థియేటర్స్ రిలీజ్ డేట్‌ను ప్రకటించిననున్నట్టు తెలిపారు. తమిళ చిత్రం అసురన్‌కి రీమేక్‌గా తెరకెక్కుతున్న నారప్ప చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తుండగా, వి క్రియేషన్స్ కలైపులి ఎస్.థాను సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సురేష్ బాబు నిర్మిస్తున్నారు.
In lieu of the pandemic, #Narappa will not be releasing on May 14th . A new theatrical date will be announced once we overcome this unprecedented crisis.
— Venkatesh Daggubati (@VenkyMama) April 29, 2021
Stay safe 🙏! #NarappaPostponed#Priyamani @KarthikRathnam3 #SrikanthAddala #ManiSharma @SureshProdns @theVcreations pic.twitter.com/7QWIL8lOG6
ఇవికూడా చదవండి..