IPL 2021: కరోనా ఎఫెక్ట్.. ఇద్దరు స్టార్ అంపైర్లు ఔట్

న్యూఢిల్లీ: ఐపీఎల్‌పై కరోనా ఎఫెక్ట్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఇండియాలో కరోనా కేసుల భయానికి కొందరు ప్లేయర్స్ టోర్నీ వదిలి వెళ్లిపోగా.. తాజాగా ఇద్దరు స్టార్ అంపైర్లు కూడా గుడ్‌బై చెప్పారు. అందులో ఒకరు ఇండియన్ అంపైర్ నితిన్ మీనన్ కాగా.. మరొకరు ఆస్ట్రేలియాకు చెందిన పాల్ రైఫిల్. ఈ ఇద్దరూ ఐసీసీ ఎలైట్ ప్యానెల్ అంపైర్లే కావడం గమనార్హం. ఈ ఇద్దరూ కరోనా సంబంధిత కారణాల వల్లే ఐపీఎల్‌ను వదిలి వెళ్లిపోయారు.
నితిన్ మీనన్ భార్య, తల్లికి కరోనా సోకింది. నితిన్‌కు ఓ పాప ఉండటంతో ఆమెను చూసుకోవడానికి తాను వెళ్లాల్సిందే అంటూ అతడు తన సొంతూరు ఇండోర్‌కు వెళ్లిపోయాడు. మరోవైపు పాల్ రైఫిల్ తాను ఇంటికి వెళ్లగలనో లేదోనన్న ఆందోళన కలుగుతోందంటూ ఆస్ట్రేలియా విమానాలపై నిషేధం విధించక ముందే వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని బీసీసీఐ కూడా ధృవీకరించింది.
ఈ ఇద్దరి స్థానంలో ఇప్పటికే కొందరు స్థానిక అంపైర్లను బ్యాకప్‌గా ఉంచింది బీసీసీఐ. మీనన్, రైఫిల్‌లకు షెడ్యూల్ చేసిన మ్యాచ్‌ల బాధ్యతలను వాళ్లకు అప్పగించనుంది. కరోనా కారణంగానే ఇండియన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తోపాటు ఆస్ట్రేలియా ప్లేయర్స్ ఆండ్రూ టై, ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్సన్ టోర్నీ వదిలి వెళ్లిపోయిన విషయం తెలిసిందే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
Italy | పిల్లలు విధ్వంసానికి పాల్పడితే,తల్లిదండ్రులు పరిహారం చెల్లించాలి! ఇటలీ ప్రభుత్వం కొత్త నిబంధన
Delhi Pollution | ఢిల్లీలో క్షీణించిన వాయు నాణ్యత జీఆర్ఏపీ-1 ఆంక్షలు అమలు
Kenya | స్వర్గం పేరుతో 190 మంది పిల్లలకు ఆకలి చావులు.. కెన్యాలో మత గురువు మూఢ బోధనలు
TGSRTC | తిరుగు ప్రయాణమూ భారమే..! ఆర్టీసీ, ప్రైవేటు వాహనాల్లో చార్జీల మోత
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

