nani shyam singha roy | ‘బెంగాల్‌టైగర్ అంత పౌరుషం ఉన్న యువకుడు శ్యామ్‌సింగరాయ్. కోల్‌కతాలో నివసించే అతను ఓ లక్ష్యం కోసం తెలుగునేలపై అడుగుపెడతాడు. అక్కడ అతనికి ఎదురైన పరిస్థితులేమిటి? ఆశయసాధన కోసం శ్యామ్‌సింగరాయ్ ఎలాంటి పోరాటం చేశాడు?’.. ఈ విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే అంటున్నారు రాహుల్ సంకృత్యాన్. ఆయన దర్శకత్వంలో నాని కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘శ్యామ్‌సింగరాయ్’. వెంకట్ బోయనపల్లి నిర్మాత. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ కథానాయికలు. డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నెల 18న టీజర్‌ను రిలీజ్ చేయబోతున్నారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన కొత్త పోస్టర్లో నాని మండుతున్న కర్రను పట్టుకొని ఉగ్రరూపంలో కనిపిస్తున్నారు. ఆయన్ని మునుపెన్నడూ చూడని కొత్త కోణంలో ఆవిష్కరించే చిత్రమిదని, వీఎఫ్ఎక్స్కు చాలా ప్రాధాన్యత ఉంటుందని దర్శకుడు తెలిపారు. రాహుల్ రవీంద్రన్, మురళీశర్మ, అభినవ్ గోమటం, జిషుసేన్‌గుప్తా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సాను జాన్ వర్గీస్, సంగీతం: మిక్కీ జే మేయర్, కథ: సత్యదేవ్ జంగా, నిర్మాణ సంస్థ: నిహారిక ఎంటర్టైన్మెంట్స్, దర్శకత్వం: రాహుల్ సంకృత్యాన్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Shyam Singha Roy Story | నాని కంటే ముందు ‘ శ్యామ్ సింగరాయ్’ కథ విన్న హీరో ఎవరు..?
Bala Krishna: ఈ సారి నానితో సందడి చేయనున్న బాలకృష్ణ.. ప్రూవ్ ఇదిగో..!
నానితో మూడోసారి జోడీ కడుతున్న సమంత.. అలాంటి పాత్రలో..
Nani: ఎట్టకేలకు థియేటర్స్‌లో విడుదల అవుతున్న నాని చిత్రం
Hrithik Roshan Telugu Remake | నాని సినిమాపై కన్నేసిన బాలీవుడ్ స్టార్ హీరో..!
Shyam Singha Roy | స్పెషల్ అట్రాక్షన్‌గా ‘శ్యామ్ సింగరాయ్’ భామల ఫస్ట్ లుక్