సాధారణంగా టాలీవుడ్ (Tollywood) దర్శకులు కొన్నిసార్లు ఏదో ఒక హీరోను దృష్టిలో పెట్టుకుని కథలు రాసుకుంటారు. అయితే ఒక హీరో కోసం రాసుకున్న కథ అనుకోకుండా మరో హీరో దగ్గరికి వెళ్తుంది. గతంలో చాలా సార్లు ఇలా ఒకరు చేయాల్సిన ప్రాజెక్టు ఇంకొకరి దగ్గరికి వెళ్లి..బాక్సాపీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హట్‌గా నిలిచిన చిత్రాలు చాలానే ఉన్నాయి. దీంతో ఒక హీరో ఖాతాలో పడాల్సిన హిట్ మరో హీరో ఖాతాలోకి వెళ్లిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
అయితే ఇపుడీ టాపిక్ రావడానికి కారణం టాలీవుడ్ మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్టు శ్యామ్ సింగరాయ్ (Shyam Singha Roy). తాజాగా ఫిలింనగర్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం..ఈ సినిమా కోసం డైరెక్టర్ రాహుల్ సంకీర్త్యన్ (Rahul Sankrtiyan) మొదట నాని కంటే ముందు రానా (Rana) దగ్గరికి వెళ్లాడట. రానాను మైండ్‌లో ఉంచుకొని స్క్రిప్ట్ సిద్దం చేశాడట. అయితే ఈ కథ విన్న రానా సినిమాను తిరస్కరిస్తూనే…ఈ స్టోరీ నాని(Nani)కి అయితే బాగా సెట్ అవుతుందని రాహుల్‌కు సూచించినట్టు టాక్.
రానా సూచనతో రాహుల్ కూడా వెంటనే నానికి కథ చెప్పగా..నాని మరోసారి ఆలోచించకుండా వెంటనే ఒకే చేశాడట. మొత్తానికి అలా రానా చేయాల్సిన సినిమా నాని ఖాతాలో పడిందన్నమాట.ఈ చిత్రంలో నాని రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించబోతున్నాడు. కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్, సాయిపల్లవి ఫీ మేల్ లీడ్ రోల్స్ చేస్తున్నారు.
కోల్‌కతా బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలోని ప్రధాన భాగాన్ని కోల్‌కతాతోపాటు పశ్చిమబెంగాల్లోని పలు ప్రాంతాల్లో షూట్ చేశారు. నిహారిక ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Kamal Haasan New Movie | అవార్డు విన్నింగ్ డైరెక్టర్‌తో కమల్‌హాసన్ కొత్త సినిమా..!
Vishwak Sen Interesting Title | ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో ‘ఫలక్‌నుమా దాస్’ కొత్త సినిమా
Bad Luck Sakhi video song | పల్లెటూరి సరదాలతో ‘బ్యాడ్ లక్ సఖి ‘ వీడియో సాంగ్
Malaika Arora | మలైకా వల్ల అర్జున్ కపూర్ హ్యాపీగా ఉంది అప్పుడేనట..!