Watch: ఫోన్ టార్చ్ వెలుగులో ఆర్టీసీ బస్సు నడిసిన డ్రైవర్.. వీడియో వైరల్
Karnataka RTC Bus | రాత్రి వేళ ప్రయాణంలో ఆర్టీసీ బస్సు హెడ్లైట్లు పనిచేయలేదు. రోడ్డుపై చీకటిగా ఉండటంతో డ్రైవర్ ఇబ్బంది పడ్డాడు. దీంతో కండక్టర్ మొబైల్ ఫోన్లోని టార్జ్ లైట్ చూపించడంతో ఆ వెలుగులో బస్సు నడిపాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
బెంగళూరు: రాత్రి వేళ ప్రయాణంలో ఆర్టీసీ బస్సు హెడ్లైట్లు పనిచేయలేదు. రోడ్డుపై చీకటిగా ఉండటంతో డ్రైవర్ ఇబ్బంది పడ్డాడు. దీంతో కండక్టర్ మొబైల్ ఫోన్లోని టార్జ్ లైట్ చూపించడంతో ఆ వెలుగులో బస్సు నడిపాడు. (Karnataka RTC Bus) కర్ణాటక ఆర్టీసీ బస్సుల దుస్థితికి అద్దం పట్టే ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కల్యాణ కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ (కేకేఆర్టీసీ) బస్సు కలబురిగి నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న చించోలి పట్టణానికి బయలుదేరింది. ఆ బస్సు చివరి సర్వీసు సమయంలో రాత్రి వేళ హెడ్లైట్స్ పని చేయలేదు.
కాగా, ఆ రోడ్డు మార్గం పూర్తి చీకటిగా ఉండటంతో బస్సు నడిపేందుకు డ్రైవర్ ఇబ్బంది పడ్డాడు. ఈ నేపథ్యంలో కండక్టర్ తన మొబైల్ ఫోన్లోని టార్చ్ వెలుగులో రోడ్డు మార్గాన్ని చూపించాడు. దీంతో ఆ డ్రైవర్ బస్సు నడిపాడు. ఈ సందర్భంగా ఆ బస్సులోని ప్రయాణికులు కొంత ఆందోళన చెందారు. ఒక ప్రయాణికుడు రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో కర్ణాటక ఆర్టీసీ బస్సుల దుస్థితిపై విమర్శలు వెల్లువెత్తాయి.
ಕಲಬುರಗಿಯಿಂದ ಚಿಂಚೋಳಿಗೆ ತೆರಳುತ್ತಿದ್ದ ಕಲ್ಯಾಣ ಕರ್ನಾಟಕ ರಸ್ತೆ ಸಾರಿಗೆ ನಿಗಮ (KKRTC) ಬಸ್ನ ಹೆಡ್ಲೈಟ್ ರಾತ್ರಿ ವೇಳೆ ಏಕಾಏಕಿ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಸ್ಥಗಿತಗೊಂಡ ಹಿನ್ನೆಲೆಯಲ್ಲಿ, ಚಾಲಕ ಮತ್ತು ನಿರ್ವಾಹಕರು ಮೊಬೈಲ್ ಫೋನ್ನ ಟಾರ್ಚ್ ಬೆಳಕಿನ ನೆರವಿನಿಂದ ಬಸ್ ನ್ನು ಚಲಾಯಿಸಿದ ಘಟನೆ ನಡೆದಿದೆ.@XpressBengaluru @NewIndianXpress… pic.twitter.com/hersyYgH30
— kannadaprabha (@KannadaPrabha) July 5, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆపన్నుడికి లయన్స్ క్లబ్ నోబుల్ ఆపన్నహస్తం
Maharashtra | రోడ్లపై, బహిరంగ ప్రదేశాలలో టపాసులు కాల్చడంపై మహారాష్ట్రలో నిషేధం.. బాంబే హైకోర్టు ఆదేశం
Sarpanches | విద్యుత్ సిబ్బంది కనీసం ఫోన్లు కూడా ఎత్తడం లేదు.. కరెంట్ కష్టాలపై సర్పంచ్లు
Bathukamma Celebrations | కుభీర్లో ఘనంగా కొనసాగుతున్న బతుకమ్మ సంబరాలు
Bhaskar Rao | సింగరేణి లాభాల తగ్గుదలపై సమగ్ర నివేదిక విడుదల చేయాలి : మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

