రూ 1.60 కోట్ల విలువైన డ్రగ్ సీజ్
రాష్ట్ర ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్, డ్రగ్ ఇన్స్పెక్టర్ల సంయుక్త తనిఖీల్లో రూ.1.60 కోట్ల విలువైన నిషేధిత సింథటిక్ డ్రగ్ పట్టుబడింది.
హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్, డ్రగ్ ఇన్స్పెక్టర్ల సంయుక్త తనిఖీల్లో రూ.1.60 కోట్ల విలువైన నిషేధిత సింథటిక్ డ్రగ్ పట్టుబడింది. డ్రగ్ కంట్రోల్, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అవినాశ్ మహంతి ఆదేశాల మేరకు ఎస్టీఎఫ్ డీ-టీమ్ డీఎస్పీ తిరుపతి యాదవ్, సీఐ నాగరాజు, డ్రగ్ కంట్రోల్ ఇన్స్పెక్టర్లు ఇందిరా ప్రియదర్శిని, అన్వేష్ మంగళవారం నాచారంలోని హైమా సింథసిస్ ప్రైవేట్ లిమిటెడ్ ట్రేడింగ్ షాపులో తనిఖీలు నిర్వహించి 5.860 కిలోల ఎన్-బెంజైల్పైపెరాజైన్ డ్రగ్‌ను సీజ్ చేశారు.
ఆ సంస్థ గుజరాత్ నుంచి ఈ డ్రగ్‌ను తీసుకొచ్చి హైదరాబాద్‌తోపాటు బెంగళూరు, ముంబైకి సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. హైమా సింథసిస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ముదిగొండ ఈశ్వర్‌పై కేసు నమోదు చేశారు. నిందితుడిని నాచారం ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించి విచారణ జరుపుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెడిషనల్ లుక్‌లోనూ గ్లామర్ ట్రీట్.. యాంకర్ స్రవంతి అదిరిపోయే ఫొటోషూట్!
Sandiyar | ‘చిత్తా’ దర్శకుడితో కమల్ హాసన్ కొత్త చిత్రం.. ‘సండియార్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల!
Chapri | స్లమ్ కుర్రాడి ప్రేమ కథా చిత్రంగా సరోజ్ కుమార్ ‘ఛప్రి’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!
Madarasi Rabbaru Bomma | ‘టైసన్ నాయుడు’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ విడుదల
AnaswaraRajan | ‘ఇట్లు అర్జున’ లో కీర్తి పాత్ర ప్రతి అమ్మాయికి కనెక్ట్ అవుతుంది: అనస్వర రాజన్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

