నానితో మూడోసారి జోడీ కడుతున్న సమంత.. అలాంటి పాత్రలో..

samanhta and nani | నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత ఏం చేస్తుందనేది ఇప్పుడు అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. విడాకుల తర్వాత ఆమె కెరీర్ ఎలా ఉండబోతోందనని ఆలోచిస్తున్నారు. అసలు ఆమెకు అవకాశాలు వస్తాయా? రావా? అని కూడా చాలామంది సందేహిస్తున్నారు. కానీ ఇలాంటి సమయంలో ఆమె వరుసగా సినిమాలు ఒప్పుకుంటుంది. ఇప్పటికే శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న సమంత.. విడాకుల తర్వాత రెండు సినిమాలను ఓకే చెప్పింది. ఇప్పుడు మూడో సినిమా కూడా ఒప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అది కూడా నేచురల్ స్టార్ నానితో ఆమె జోడీ కట్టబోతున్నట్లు తెలుస్తోంది.

విడాకుల తర్వాత సమంత.. రెండు ప్రాజెక్టులను ఒప్పుకుంది. డ్రీమ్ వారియర్ పిక్చర్ బ్యానర్లో ఒక తమిళ సినిమా చేయబోతుంది. దీంతో పాటు తెలుగులో శ్రీదేవి మూవీస్ బ్యానర్లో మరో సినిమాకు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు నానితో దసరా సినిమాకు ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. శ్యామ్ సింగరాయ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న నాని ప్రస్తుతం.. అంటే సుందరానికి సినిమాతో బిజీగా ఉన్నాడు. దీంతో పాటు దసరా అనే మరో సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఇప్పటికే కీర్తి సురేశ్ ( Keerthy suresh ) ఒక హీరోయిన్గా ఎంపికైంది. ఇందులో రెండో హీరోయిన్‌కు కూడా అవకాశం ఉంది. ఆ పాత్ర కోసం అక్కినేని మాజీ కోడలు సమంతను ఎంపిక చేసినట్లు సమాచారం.
దసరా సినిమాలో నాని తెలంగాణ యువకుడిగా కనిపించబోతున్నాడు. సింగరేణి నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోంది. చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల విడుదలైన టీజర్ ఆకట్టుకుంటుంది. ఈ టీజర్లో తెలంగాణ యాషలో మాట్లాడి నాని అదరగొట్టాడు. గతంలో రాయలసీమ యాషలో మాట్లాడి మెప్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తెలంగాణ యాషలో మాట్లాడేందుకు నాని ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. దసరా సినిమాలో ఇప్పటికే ఒక హీరోయిన్గా కీర్తి సురేశ్‌ను ఎంపిక చేశారు. కాగా ఈ సినిమాలో రెండో హీరోయిన్ కూడా ఉంటుంది. ఈ పాత్ర కోసం ఇప్పటికే దర్శక నిర్మాతలు సమంతను కలిశారంట. ఇప్పటికే నాని, సమంత కలిసి ఎటో వెళ్లిపోయింది మనసు, ఈగ సినిమాల్లో నటించారు. ఈ సినిమాల్లో వీళ్ల కెమిస్ట్రీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో దసరా సినిమాలో రెండో హీరోయిన్ అవకాశం కోసం సమంతను దర్శక నిర్మాతలు సంప్రదించారంట. దీనికి సమంత కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Samantha |అప్పుడే మనుషుల నిజస్వరూపం బయటపడుతుంది.. వైరల్‌గా మారిన సమంత పోస్టు
Samantha | సమంత పోస్టుపై వెంకటేశ్ కూతురి ఆసక్తికర కామెంట్
Samantha: సమంత- చైతూ పోటీ పడి సినిమాలు చేస్తున్నారుగా..!
సమంత తీర్థయాత్రల వెనక అసలు కారణం ఏంటి..?
NANI 29: ఈ దసరా నిరుడు లెక్క ఉండదు .. ఆసక్తికరంగా నాని ఫస్ట్ లుక్
నాని మేల్కోవాల్సిన సమయం వచ్చేసింది.. ఇదిలాగే కంటిన్యూ అయితే..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- dasara
- keerthy suresh
- Nani
- Samantha
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

