Samantha |అప్పుడే మనుషుల నిజస్వరూపం బయటపడుతుంది.. వైరల్‌గా మారిన సమంత పోస్టు

Samantha | నాగచైతన్యతో విడాకుల తర్వాత ఇప్పుడిప్పుడే సమంత మళ్లీ యాక్టివ్ అవుతుంది. విడాకులు తీసుకున్న తర్వాత కొద్దిరోజులు బాధలో కనిపించిన సమంత.. దాని నుంచి బయటపడేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలోనే తన స్నేహితురాలు శిల్పా రెడ్డితో కలిసి తీర్థయాత్రలకు వెళ్లొచ్చింది. ఇప్పుడు విదేశాలను కూడా చుట్టేస్తుంది. అలాగే సోషల్ మీడియాలో కూడా మళ్లీ యాక్టివ్‌గా మారింది. తాను ఏం చేస్తున్నది.. ఎక్కడ ఉన్నది మొత్తం అభిమానులతో పంచుకుంటుంది. ఈ క్రమంలోనే తన మానసిక వైఖరి గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో సమంత పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఇటీవల సోషల్ మీడియాలో సమంత పేరు మార్మోగిపోతుంది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత ఆమె ఏం చేస్తుందో తెలుసుకునేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఆమె సోషల్ మీడియా అకౌంట్లపై ఒక కన్నేసి ఉంచుతున్నారు. దీంతో తన ఫ్రెండ్‌తో కలిసి తీర్థయాత్రకు వెళ్లడం.. నాగ చైతన్య ఫొటోలు డిలీట్ చేయడం.. పెయింగ్ చేస్తున్న ఫొటోలు పోస్టు చేయడం.. ఇలా ప్రతీది సమంత ఏం చేసినా వైరల్ అవుతుంది. ఇటీవల అమ్మాయికి పెళ్లికంటే చదువు ముఖ్యమని ఆడపిల్లల తల్లిదండ్రులకు సమంత సూచిస్తూ ఎమోషనల్‌గా చేసిన పోస్టు చేస్తే అది కూడా తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో మోటివేషనల్ లైన్స్‌ను షేర్ చేసింది సమంత. ప్రముఖ రైటర్ రాబర్ట్ కొటేషన్‌ను ఇన్స్టాగ్రామ్ స్టోరీగా పెట్టింది.

ఇంతకీ ఆ కొటేషన్ అర్థమేంటంటే.. మనిషి ఒత్తిడిలో తీసుకున్న నిర్ణయాలే అతనేంటో తెలియజేస్తాయి. తట్టుకోలేని ప్రెజర్‌కు గురైన సమయంలో మనిషి అసలు స్వభావం బయటపడుతుంది. ఇప్పుడు ఈ కొటేషన్ చూసిన ఫ్యాన్స్ దీనిలో భిన్న అర్థాలను వెతుకుతున్నారు నెటిజన్లు. ఈ పోస్టు వెనుక అర్థమేంటని తెగ ఆలోచించేస్తున్నారు. ఏదేమైనా సోషల్ మీడియాలో ఇప్పుడు సమంత ఏం చేసినా తెగ వైరల్‌గా మారిపోతున్నాయి. ఇటీవల శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తి చేసిన సమంత.. స్నేహితులతో కలిసి షికార్లుచేస్తుంది. ప్రస్తుతం సమంత తన స్నేహితులు ప్రీతమ్ జుకల్కర్, సాధన సింగ్‌తో కలిసి దుబాయి టూర్ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Samantha | సమంత పోస్టుపై వెంకటేశ్ కూతురి ఆసక్తికర కామెంట్
Samantha: చైతూ ఫోటోలని తొలగించిన సమంత
సమంత తీర్థయాత్రల వెనక అసలు కారణం ఏంటి..?
Samantha: నయన్‌కు బెస్ట్ విషెస్ అందించిన సామ్…ఎందుకో తెలుసా..!
Samantha: నాగచైతన్య కోసం సమంతఇన్ని త్యాగాలు చేసిందా?
Samantha: సమంత- చైతూ పోటీ పడి సినిమాలు చేస్తున్నారుగా..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

