NANI 29: ఈ దసరా నిరుడు లెక్క ఉండదు .. ఆసక్తికరంగా నాని ఫస్ట్ లుక్

వరుస సినిమాలతో బిజీగా ఉన్న నాని ఇటీవల టక్ జగదీష్ చిత్రంతో ప్రేక్షకులని పలకరించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ఓటీటీలో విడుదల కాగా, ప్రేక్షకులని పెద్దగా అలరించలేకపోయింది. ఇక ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్ అనే సినిమాలో నటిస్తున్నాడు నాని. ఈ సినిమాకు టాక్సీవాల ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో సాయి పల్లవి, మడోనా సెబాస్టియన్ తోపాటు లేటెస్ట్ సెన్సేషన్ కృతిశెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
మరోవైపు ‘అంటే.. సుందరానికి’ అనే సినిమా చేస్తున్నాడు నాని. ఈ సినిమాను ‘మెంటల్ మదిలో’ ‘బ్రోచేవారెవరురా’ ఫేం వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేస్తున్నారు. రీసెంట్గా తన 29వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన దసరా రోజున రానుందని నాని తెలియజేశాడు. ఈ క్రమంలోనే దసరా అంటూ అందరినీ ఆకర్షించాడు. రగ్డ్ లుక్కుతో ఉన్న నాని దసరా అంటూ రాబోతోన్నాడు. ఈ దసరా నిరుడు లెక్క ఉండదు అంటూ ఏదో చెప్పేందుకు ప్రయత్నించాడు. చూస్తుంటే దసరా చిత్రంతో నాని సరికొత్త వినోదం అందించేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది.
ఈ సినిమాని శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించనున్నాడు. కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుంది.ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

