Nani and Saipallavi | అదృష్టం బాగుంటే గడ్డిపోచ కూడా బలమైన తాడులా మారుతుంది. 4 సంవత్సరాల కింద నాని టైం అలాగే ఉంది. ఆయన ఎలాంటి సినిమా చేసినా హిట్ అనే మాట తప్ప ఇంకో మాట ఉండేది కాదు. వరుసగా 8 విజయాలు అందుకొన్నాడు. అందులో చివరి విజయం ఎంసీఏ. 2015లో ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో మొదలైన నాని జైత్రయాత్ర 2017 డిసెంబర్ 21న విడుదల అయిన ఎంసీఏ సినిమాతో ముగిసింది. వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్గా నటించింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఎంసీఏ నెగిటివ్ టాక్ ఎదుర్కొని 40 కోట్ల షేర్ వసూలు చేసింది. MCA 4 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఫైనల్ కలెక్షన్స్ ఒక్కసారి చూద్దాం..
నైజాం: 14.22 కోట్లు
సీడెడ్: 5.25 కోట్లు
ఉత్తరాంధ్ర: 4.10 కోట్లు
ఈస్ట్: 2.45 కోట్లు
వెస్ట్: 1.81 కోట్లు
గుంటూరు: 2.26 కోట్లు
కృష్ణా: 2.11 కోట్లు
నెల్లూరు: 1.08 కోట్లు
ఏపీ-తెలంగాణ టోటల్: 33.58 కోట్లు
రెస్టాఫ్ ఇండియా + ఓవర్సీస్: 6.56 కోట్లు
వరల్డ్ వైడ్ టోటల్: 39.98 కోట్లు
ఎంసీఏ సినిమాకు రూ.29 కోట్ల బిజినెస్ జరిగింది. నాని అక్కడ మంచి ఫామ్లో ఉన్నాడు. దాంతో ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ మాత్రం అదిరిపోయాయి. ఫుల్ రన్లో ఏకంగా 40 కోట్లు వసూలు చేసింది ఎంసీఏ. నైజాంలో అయితే 14 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి అదరగొట్టాడు నాని.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
శ్యామ్ సింగరాయ్, 83 సహా.. క్రిస్మస్కు వస్తున్న సినిమాలు ఇవే..
ఆ హీరోయిన్ కోసం రవితేజను బాలయ్య కొట్టాడా? గొడవలపై క్లారిటీ వచ్చేసింది
Bheemla nayak postponed | భీమ్లా నాయక్ ఎఫెక్ట్.. ఎఫ్ 3 రిలీజ్ వాయిదా
Rakul | పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన రకుల్!
Samantha | సెక్సీగా కనిపించడం అంత ఈజీ కాదు.. సమంత షాకింగ్ పోస్ట్