The Paradise | టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ (The Paradise) సినిమాపై ప్రస్తుతం సోషల్ మీడియాలో క్రేజీ వార్త చక్కర్లు కొడుతుంది. ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత ఈ క్రేజీ కాంబోలో వస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలున్నాయి. అయితే, సినిమాలోని సస్పెన్స్‌ను మెయింటైన్ చేయడానికి మరియు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచడానికి మేకర్స్ ట్రైలర్ లేకుండానే సినిమాను నేరుగా థియేటర్లలోకి తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే ఈ ప్రచారంపై చిత్ర యూనిట్, మేకర్స్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ మరియు ఇతర అప్డేట్స్ విషయంలో ఎలాంటి ప్రయోగాలు చేస్తున్నారనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు, ఈ సినిమా తాజాగా షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే విడుదలైన ‘ది ప్యారడైజ్’ టీజర్ మరియు ‘ఆయా షేర్’, ‘ఎషనాగుల’ లాంటి సాంగ్స్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.