Vande Mataram | వందేమాతరం వివాదం.. కాశ్మీరీలను జైలుకు పంపిస్తారా.. కాంగ్రెస్పై కాశ్మీర్ సీఎం ఫైర్
Vande Mataram : జమ్మూ కాశ్మీర్లో వందేమాతరం గేయాన్ని పూర్తిగా ఆలపించబోమని కాంగ్రెస్ చెబుతుంటే.. తాము మాత్రం మొత్తం గేయాన్ని ఆలపిస్తామని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ (ఎన్సీపీ) ప్రకటించింది.
Vande Mataram : జమ్మూ కాశ్మీర్లో వందేమాతరం గేయం ఆలపించే విషయంపై రాజకీయ వివాదం నడుస్తోంది. ఈ గేయాన్ని పూర్తిగా ఆలపించబోమని కాంగ్రెస్ చెబుతుంటే.. తాము మాత్రం మొత్తం గేయాన్ని ఆలపిస్తామని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ (ఎన్సీపీ) ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ కూటమిలో కాంగ్రెస్ పార్టీ భాగస్వామిగా ఉంది. కూటమి ప్రభుత్వంగా ఉన్నప్పటికీ.. కాంగ్రెస్ వైఖరిని ఎన్సీపీని తప్పుబట్టింది. ఈ మేరకు సీఎం ఒమర్ అబ్దుల్లా కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు.
తాజాగా జమ్మూ కాశ్మీర్లో అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ ప్రారంభమైంది. ఈ ప్రారంభ వేడుకల సందర్భంగా జాతీయ గీత జనగణమనతోపాటు జాతీయ గేయం వందేమాతరం కూడా ప్లే చేశారు. ఈ రెండూ ప్లే చేసేటప్పుడు జమ్మూ కాశ్మీర్ ఎల్జీ, సీఎం, ఇతర నేతలు నిలబడి ఉన్నారు. అయితే, పూర్తి గేయం ప్లే చేయడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. తాము ఈ గేయాన్ని పూర్తిగా ఆలపించబోమని, రెండు చరణాలు మాత్రమే పాడుతామని కాంగ్రెస్ చెప్పింది. అయితే, సీఎం ఒమర్ అబ్దుల్లా మాత్రం కాంగ్రెస్ వైఖరిపై మండిపడ్డారు. శుక్రవారం ఈ అంశంపై మాట్లాడారు. వందేమాతరం గేయం పాడాలంటూ చట్టం చేసేటప్పుడే పార్లమెంట్లోనే కాంగ్రెస్ అడ్డుకోవాల్సింది.
ఇప్పుడు ఇది చట్టంగా మారింది. దీని ప్రకారం మొత్తం గేయం పాడాలి. అలా పాడకుంటే అది నేరమే. ఈ చట్టం దేశమంతా వర్తిస్తుంది. ప్రభుత్వాలు దీన్ని అమలు చేయకుండా తప్పించుకోకూడదు. ఈ చట్టం ప్రకారం వందేమాతరంలోని అన్ని గేయాలు పూర్తిగా ఆలపించాల్సిందే. ఈ విషయంలో కాంగ్రెస్ అభ్యంతరం ఏంటి..? వందేమాతరం ఆలపించకుండా కాశ్మీర్ ప్రజలు జైలులో ఉండాలని కాంగ్రెస్ భావిస్తోందా..? ఇది చట్టపరమైన బాధ్యత. కావాలనుకుంటే కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి రావాలి.
ఆ తర్వాత వారు ఈ చట్టాన్ని రద్దు చేయొచ్చు.. అంటూ ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. తమ పార్టీ సిద్ధాంతాలకు, వందేమాతరం గేయానికి సంబంధం లేదన్నారు. ఇది చట్టం అని, అందువల్లే పాటిస్తున్నామన్నారు. కూటమిలో ఉన్నంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ తమపై ఒత్తిడి తేలేదని ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

