బూర్గంపహాడ్, సెప్టెంబర్ 11 : భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో చత్తీస్గఢ్, ఒడిశా నుండి వచ్చిన వలస ఆదివాసీలకు హైదరాబాద్కు చెందిన షిలోహు మిషనరీ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో రూ.1.25 లక్షల విలువైన దోమ తెరలను సారపాక గాంధీనగర్ సియోను ప్రార్ధనా మందిరంలో షిలోహు మిషనరీ మినిస్ట్రీస్ వ్యవస్థాపకుడు ఫాస్టర్ మోజేష్ ములక చేతులమీదుగా శుక్రవారం పంపిణీ చేశారు. వీటిని తాడ్వాయి, మంగపేట, పినపాక మండలాల్లోని శాంతినగర్, కేఎంనగర్, ఎర్షకుంట, భద్రాద్రి జిల్లాలో ములకలపల్లి మండలం పాత గుండాలపాడు, పాలవాగు ప్రాంతాల్లో వలస ఆదివాసీ కుటుంబ ప్రాంతాల్లో పనిచేసే ఫాస్టర్లకు అందజేశారు. అలాగే పాలవాగు ఆదివాసీ విద్యార్థులకు పలకలు, బలపాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో షిలోహు మిషనరీ బృందం సభ్యులు పాస్టర్లు పెద్దారావు, టీఎం.కుమార్, ఏరియా ఇన్చార్జ్లు ఫాస్టర్ ఇర్ఫాలాల్, ఫాస్టర్ బెంజిమెన్, రత్నకుమార్, స్టీవెన్బాబు, బద్రర్ ఇమ్మానుయేల్, మోతుకూరి విజయచరణ్ పాల్గొన్నారు.