Fauji | గ్లోబల్ స్టార్ యాక్టర్ ప్రభాస్ (Prabhas) -హను రాఘవపూడి (Hanu Raghavapudi) కాంబినేషన్లో సినిమా వస్తుందని తెలిసిందే. `ఫౌజీ`(Fauji) టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రంలో ఇమాన్వీ (Imanvi) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది.
పాపులర్ మలయాళ భామ నమితా ప్రమోద్ ఈ మూవీలో సెకండ్ ఫీ మేల్ లీడ్ రోల్లో కనిపించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. నమితా ప్రమోద్ ఇప్పటికే తెలుగులో చుట్టాలబ్బాయి, కథలో రాజకుమారి సినిమాల్లో నటించింది. మరి ప్రభాస్ సినిమాపై మేకర్స్ ఏదైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి. ఫౌజీ హనురాఘవపూడి కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్నట్టు ఇన్సైడ్ టాక్.
ఈ మూవీలో ప్రభాస్ ఒక సైనికుడి పాత్ర పోషిస్తున్నాడని ఇన్సైడ్ టాక్. సీతారామం, రాధేశ్యామ్ లైన్లో వింటేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఫౌజీ సాగనుందట. ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ 2, సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో స్పిరిట్, మారుతి డైరెక్షన్లో రాజాసాబ్ సినిమాలు చేస్తున్నాడు.
Unstoppable With NBK | బాలకృష్ణతో సూర్య, దుల్కర్ సల్మాన్ సందడి.. క్రేజీ వార్త వివరాలివే
Rakul Preet Singh | వెన్ను నొప్పిని లెక్కచేయలే.. ఆరు రోజులుగా బెడ్పైనేనన్న రకుల్ ప్రీత్ సింగ్
Matka | కూల్ స్పాట్ క్లబ్ చూశారా..? వరుణ్ తేజ్ టీం నుంచి మట్కా నయా గ్లింప్స్