Mythri Movie Makers | తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్ ప్రముఖ సినీ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) ముందుకొచ్చింది. వరద బాధితుల కోసం తమ వంతు సాయంగా రూ.50 లక్షలను విరాళంగా ప్రకటించింది. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ప్రత్యేక పోస్ట్ పెట్టింది.
గడిచిన వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రాణ నష్టంతో పాటు భారీ ఆస్తి నష్టం జరిగింది. ఈ విపత్తు సమయంలో ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలకు మా వంతు సాయంగా ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధులకు రూ.50లక్షలు విరాళంగా ఇస్తున్నాం. ఈ ప్రతికూల పరిస్థితుల నుంచి తెలుగు రాష్ట్రాల ప్రజలు త్వరగా కోలుకోవాలి. బాధిత కుటుంబాలు సాధారణ స్థితికి రావాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాం అంటూ మైత్రీ మూవీ మేకర్స్ పోస్ట్ చేసింది.
We shall together get through these tough times.
Wishing for a speedy recovery of the affected and hoping normalcy is restored soon. pic.twitter.com/EI5WRaq91G— Mythri Movie Makers (@MythriOfficial) September 6, 2024
ఇప్పటికే అగ్ర హీరోలు మెగాస్టార్ చిరంజీవితో పాటు బాలకృష్ణ, మహేశ్‌బాబు, ఎన్టీఆర్, విశ్వక్సేన్, సిద్ధూ జొన్నలగడ్డ తదితరులు విరాళం ప్రకటించారు.
Also read..