Chitradurga | కర్ణాటక (Karnataka) రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తన తల్లి ఫిర్యాదును స్వీకరించడానికి పోలీసులు నిరాకరించడంతో (complaint refuse) ఓ యువకుడు ఏకంగా తహసీల్దార్ వాహనానికే నిప్పు పెట్టాడు. ఈ ఘటన చిత్రదుర్గ (Chitradurga)లో చోటు చేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పృథ్వీరాజ్ అనే వ్యక్తి బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. అయితే, అతడు జులైలో ఓ ట్రిప్‌కు వెళ్లాడు. అప్పటి నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో అతడి తల్లి చల్లకెరె పోలీసులను సంప్రదించింది. కుమారుడు కనిపించకుండా పోవడంతో ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించగా.. పోలీసులు ఆమె ఫిర్యాదును స్వీకరించేందుకు నిరాకరించారు. అనంతరం జులై 23న యువకుడు తిరిగి వచ్చాడు. తన తల్లి ఫిర్యాదును స్వీకరించని విషయాన్ని తెలుసుకుని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
దీంతో చల్లకెరె తహసీల్దార్ (Challakere tehsildar) కార్యాలయానికి వెళ్లి ఆందోళన చేపట్టాడు. తహసీల్దార్ వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. వెంటనే స్పందించిన కార్యాలయ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని పృథ్వీరాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, అధికారిక విధులకు ఆటంకం కలిగించడం వంటి కేసులు నమోదు చేశారు.
An mentally insane person tried to torch the jeep belonging to #Challakere tahsildar at Challakere in #Chitradurga district on Thursday.@XpressBengaluru pic.twitter.com/ATnBDueUhp
— Subash_TNIE (@S27chandr1_TNIE) September 5, 2024
Also Read..
Sakshee Malikkh | వినేశ్, బజరంగ్ల నిర్ణయంపై సాక్షి మాలిక్ కీలక వ్యాఖ్యలు
Vaddepalli Srikrishna | సినీ గేయ రచయిత వడ్డెపల్లి శ్రీకృష్ణ మృతి.. సంతాపం తెలిపిన కేటీఆర్