Pune: మహారాష్ట్రలోని పూణేలో ఒక ఆశ్చర్యకర ఘటన జరిగింది. ఇద్దరు యువకులు అర్ధరాత్రిపూట ఇంటి బాల్కనీలో ఇరుక్కుపోయారు. ఇంటి లోపలికి, బయటికి వెళ్లడానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో ఏం చేయాలా అని ఆలోచించిన ఆ యువకులు వినూత్న ఆలోచన చేశార్ధ్రరాత్రి అందుబాటులో ఉండే డెలివరీ బాయ్ సేవల్ని వాడుకోవాలనుకున్నారు. వెంటనే బ్లింకిట్‌లో డెలివరీ పెట్టుకుని, ఆ ఏజెంట్ సాయం పొందారు.
ఈ తతంగం మొత్తాన్ని ఆ కుర్రాళ్లు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది వైరల్ అవుతోంది. పూణేలో ఉండే మిహిర్ గహుకర్ అనే యువకుడు, అతడి స్నేహితుడు అర్ధరాత్రి మూడు గంటల సమయంలో ఇంటి బాల్కనలో చిక్కుకుపోయారు. బాల్కనీ నుంచి బయటకు వెళ్లే డోర్లు లాక్ అయిపోయాయి. అతడి పేరెంట్స్ ఇంట్లో హాయిగా నిద్రపోతున్నారు. వారి నిద్ర డిస్టబ్ చేయడం ఎందుకు అని ఆలోచించారు. బయటకు వెళ్లడానికి ఇంకేమైనా దారుందా అని ఆలోచించగా.. డెలివరీ ఏజెంట్ గురించి గుర్తొచ్చింది. వెంటనే బ్లింకిట్ లో తమ ఇంటికి డెలివరీ పెట్టుకున్నారు. డెలివరీ ఏజెంట్ ఇంటికి చేరుకోగానే.. అతడికి తమ పరిస్థితిని వివరించారు.
పైన బాల్కనీలో ఉన్న వారు.. ఆ ఏజెంట్ ఇంటిలోపలికి ఎలా రావాలో.. కీ ఎక్కడ ఉంది.. దానితో డోర్లు అన్ లాక్ ఎలా చేయాలో ఫోన్లో వివరించారు. అతడు.. వారు చెప్పినట్లేచేసి, పైదాకా వచ్చి.. డోర్లు ఓపెన్ చేశాడు. దీంతో వారి టెన్షన్ తొలగింది. అర్ధరాత్రి తమకు డెలివరీ చేయడానికి వచ్చి సాయం చేసిన ఏజెంట్ కు వారు థాంక్స్ చెప్పారు. ఈ తతంగం మొత్తాన్ని వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం అది వైరల్ గా మారింది.